తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం పూర్తిగా నిబంధనలకు తగినట్లే నడుచుకుంటోందనీ, దురుద్దేశాలతో, అవగాహనా లేమితో కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనీ,... పత్రికలు, టీవీలు కూడా నిజానిజాలు నిర్ధారించుకోకుండా వాటిని ప్రచురించడంతో ప్రజలు మరింత గందరగోళం చెందుతున్నారని అన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. నిజామాబాద్‌లో పోలింగ్ శాతం మొదట ప్రకటించినదానికీ, చివరి ప్రకటనకూ మధ్య తేడాపై చాలా మంది లేనిపోని అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన ఆవేదనన వ్యక్తంచేశారు. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే మొదటి అంచనా శాతం ప్రకటిస్తామనీ... తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల నుంచీ సమాచారం అందాక 17A ఫారంతో (ఓటర్లు ఓటు వేసేముందు సంతకం చేసే రిజస్టర్) పోల్చి చూసుకుని, పోలింగ్ శాతం చివరి వివరాలతో 17-C ఫారం నింపి ఒక కాపీని పోలింగ్ కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజంట్లకు ఇస్తామనీ, ఆ వివరాల్నే మీడియాకు కూడా ఇస్తామని ఆయన వివరించారు. ఇది పూర్తిగా పారదర్శంగా జరిగే ప్రక్రియ అన్న ఆయన... గందరగోళం సృష్టించవద్దని కోరారు.
మాక్ పోలింగ్ టైంలో లోపాలున్న EVMలను తొలగిస్తే, వాటిని మూడో రకం ఈవీఎంలుగా పరిగణిస్తూ... తయారీదారులకు తిప్పి పంపుతామనీ, అలాగే... ముందు జాగ్రత్తగా అదనంగా తెప్పించి రిజర్వులో ఉంచే ఈవీఎంలను నాలుగో రకంగా భావిస్తామని రజత్ కుమార్ తెలిపారు. మూడు, నాలుగు రకాల ఈవీఎంలను అవసరాన్ని బట్టీ వేర్వేరు పద్ధతుల్లో తరలిస్తామన్న రజత్ కుమార్... వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రసారం చేయవద్దని కోరారు.
ఇవి కూడా చదవండి :
అంబటి రాయుడు త్రీడీ గ్లాసెస్ ట్వీట్... టీంఇండియా సెలెక్టర్లపై సెటైర్ వేసేశాడుగా...
తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్‌గా చేయించారా...
మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...
సుమలత ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేశారట... ఆమె ఏం చేశారంటే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.