PLAYING CARDS IS THE SPECIAL ON OCCATIONA OF DIWALI IN NIZAMABAD NZB VRY
Nizamabad : ఈ పండగ రోజు డబ్బులు పొగొట్టుకుంటేనే.. లక్ష్మి తిరిగి వస్తుందట.. !
ప్రతీకాత్మక చిత్రం
Nizamabad : పండలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం.. అయితే ఈ ఆచారం.. అలవాట్లు, నమ్మకాలు కొన్నిసార్లు వింతగా ఉంటాయి. ఆ నమ్మకాలను చట్టాలు వ్యతిరేకించినా.. స్థానిక ప్రజలు మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు.. తాజాగా దీపావళీకి పేకాట ఆడడం తెలంగాణలోని ఓ జిల్లాలో ఆలవాటుగా మారింది.
నిజామాబాద్ జిల్లా, పి.మహేందర్, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి..
దీపావళి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేవి లక్ష్మి పూజలు.. స్వీట్లు, టపాకాయలు.. టపాకాయలు కాలుస్తూ చికటిని తోలగించి వెలుగుల సంబరాలు చేసుకుంటారు.. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం దీపావళి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన పేకాటే.. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.. ఓ వైపు పోలీసుల హెచ్చరిస్తున్నా.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న చందంగా ఈ ఆట కొనసాగుతుంది.. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి...
ఒకరకంగా ఏపీలో సంక్రాతి పండగకు కొడి పందేలకు ఎంత ప్రత్యేకత ఉందో అంతే ప్రాధాన్యత దీపావళి పేకాటకు ఉంది.. అయితే తెలంగాణలో పేకాట పై నిషేధం విధించడంతో... గత కొంతకాలంగా పేకాట పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. పేకాట నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.. అయితే.. నిజామాబాద్ జిల్లాలో మాత్రం దీపావలి రోజు ఎవరు ఆపినా పేకట ఆగదు.. లక్ష్మి పూజలు ముగించుకోని పేకటకు సిద్దవుతారు.. గతంలో రోడ్లపైనే బహిరంగ ప్రదేశాల్లో మూడు రోజులపాటు పేకాట ఆడే వారు.. అయితే పోలీసు కేసుల భయంతో ఇప్పుడు బహిరంగా ప్రదేశాల్లో కాకుండా వారి వారి గృహ, వ్యాపార సముదయాల్లో రెండు రోజుల పాటు పేకట అడడం ఆనవాయితిగా మారింది...
దీపావళి లక్ష్మి పూజలు ముగించుకోని వ్యాపారులు అందరు కలిపి పేకాటలో కూర్చుంటారు.. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.. లక్ష్మీపూజ ఇాలా రోజు డబ్బులు పొగొట్టు కుంటే తమకు ఉన్న వ్యాపారంలో కలిసి వస్తుందని వారి నమ్మకం.. దీంతో జిల్లా కేంద్రంతో పాటు బోధన్, బాన్సువాడ, జుక్కల్, బిచ్కుంద, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతుంది.. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ ఆటలో పాల్గొంటారు.... అయితే ఈ ఆటలకు పోలీసులు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కూడా తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఇక పేకాట ఆడడం స్థానికులే కాదు. స్పేషల్ గా మహారాష్ట్ర, కర్ణాటక, హైదరబాద్ తదితర ప్రాంతాల నుంచి పేకట ఆడేందుకు నిజామాబాద్ జిల్లాకు వస్తుంటారు.. ప్రతి సంవత్సరం పోలీసులు పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పేకాట మాత్రం ఆగడం లేదు.. ఎవరి స్థాయిలో వారు గ్రూపులుగా ఎర్పాడి పేకాట ఆడతారు.. జిల్లా వ్యాప్తంగా దీపావళి పేకాటలో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి.. ఏది ఏమైనా దీపావళి సంభరాలు పేకాటతో నే ముగుస్తాయి అనడంలో సందేహం లేదు...
కాని ఇతర ప్రాంతాల్లో మాత్రం లక్ష్మిపూజ చేసుకుని ఆ రోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టని పరిస్థితి కనిపిస్తోంది. పండగ వేళ పూజలు చేసుకుని టపాసులు కాలుస్తూ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తారు. ఇలా రెండు రోజుల పాటు సాగే పండగలో ప్రజలు పాల్గొంటారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.