హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : లారీపై విమానం .. రోడ్డుపై వెళ్తుంటే చూసి ఆశ్చర్యపోయిన జనం

Telangana : లారీపై విమానం .. రోడ్డుపై వెళ్తుంటే చూసి ఆశ్చర్యపోయిన జనం

 plane on lorry

plane on lorry

Viral news: బండ్లు ఓడలవుతాయి..ఓడలు బండ్లవుతాయి అనే సామెతకు సరైన అర్ధం ఇచ్చే సంఘటన ఆదిలాబాద్‌లో జిల్లాలో జరిగింది. గాల్లో ఎగిరే విమానం కాస్తా లారీపై ఎక్కింది. విమానం ఏంటీ లారీపై తీసుకెళ్లడం ఏమిటని స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India

  (K.Lenin,News18,Adilabad)

  ప్రతి ఒక్కరికి గమ్యస్థానాలకు చేరాలంటే మూడు రవాణా మార్గాలున్నాయి. వాయు,జల, భూ మార్గం ఇలా మూడు మార్గాలు ఉన్నాయి. వాయు మార్గంలో ప్రయాణించాలంటే విమానం ఎక్కాలి. అదే జల మార్గంలో ప్రయాణించాలంటే ఓడలు, పడవలు ఎక్కాలి. ఇక ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న రోడ్డు(Road) మార్గంలో ప్రయాణించాలంటే ఏ బస్సో(Bus), కారో(Car), జీపో(Jeep) లేదంటే లారీ(Lorry)నో ఏదైన ఎక్కి ప్రయణించవచ్చు. అయితే ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనాలు ఒకవేళ రూటు మార్చి ఒకదాని మార్గంలో ఇంకొకటి ప్రయాణిస్తే ఎలా ఉంటుంది. ఊహించడానికే కాస్త విడ్డూరంగా ఉంటుంది.

  సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టేయాలంటున్న వరంగల్ యువకుడు.., తోడుగా కుక్క కూడా..

  లారీపై విమానం..

  ఆదిలాబాద్ జిల్లాలో ఎవరూ ఊహించని సంఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నింగిలో విహరించే విమానం రోడ్డుపై ప్రయాణించింది. అది కూడా మరో వాహనంపై మోసుకెళ్తున్న దృశ్యం అందరి కళ్లను ఆకర్షించింది. వింటుంటేనే ఆశ్చర్యం కలిగిస్తున్న ఈసంఘఠన ఆదిలాబాద్ జిల్లాలో కొందరికి ప్రత్యక్ష్యంగా చూసి కొత్త అనుభూమికి లోనయ్యారు. నింగిలో విహరించాల్సిన విమానం లారి మీద ఎక్కి జాతీయ రహదారిపై ప్రయాణం చేసింది. టాటా ఎయిర్ లైన్స్ కు చెందిన A-320 ఎయిర్ బస్ విమానం మరమ్మత్తుల కోసం హైదరాబాద్ నుండి నాగపూర్‌కు తరలించారు. ఈక్రమంలోనే ఆ లారీ 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొందరి కంట పడింది.

  వైరల్ అవుతున్న వీడియో..

  ఆదిలాబాద్ జిల్లాలోని నేరెడిగోండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద లారీ పై ప్రయాణమవుతున్న విమానాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. లారీపై రవాణా అవుతున్న విమానాన్ని చూసి ఓడలు బండ్లవుతాయి ...బండ్లు ఓడలవుతాయన్న సామెతను గుర్తు చేసుకున్నారు. కొందరు ఇలాంటి దృశ్యం మళ్లీ కనిపిస్తుందో లేదో అని తమ సెల్‌ఫోన్‌లతో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Adilabad, Telangana News, Viral Video

  ఉత్తమ కథలు