హైకోర్టు ముందుకు ఇఫ్తార్ లొల్లి..!

ఇఫ్తార్ విందులు, గిఫ్ట్‌ ప్యాక్‌ల కోసం 30 కోట్లకు పైగా వెచ్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐతే ఆ మొత్తాన్ని ముస్లిం సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుండని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Shiva Kumar Addula | news18
Updated: June 8, 2018, 3:08 PM IST
హైకోర్టు ముందుకు ఇఫ్తార్ లొల్లి..!
ఇఫ్తార్ విందు (ప్రతీకాత్మక చిత్రం)
  • News18
  • Last Updated: June 8, 2018, 3:08 PM IST
  • Share this:
రంజాన్ సందర్భంగా ముస్లింలకు  తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్  విందుపై రాజకీయ దుమారం రేగుతోంది. పండుగలు పబ్బాల పేరుతో కేసీఆర్ సర్కార్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రపతి ఇఫ్తార్ విందును రద్దుచేసినప్పుడు.. తెలంగాణలో కేసీఆర్ ఎందుకు విందు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో ఇఫ్తార్ విందుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మైనార్టీ సంక్షేమ నిధులతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వడాన్ని పిటిషనర్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఐతే పిల్‌పై అత్యవసంగా విచారించాలన్న పిటిషనర్ విజ్ఞ‌ప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఆ పిల్‌ను విచారణకు స్వీకరించలేదు. ఏమైనా అభ్యంతరాలుంటే మంగళవారం వింటామని తెలిపింది.

ఇవాళ సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు కేసీఆర్. ఏడు వేల మందికి సరిపడేలా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేసింది. 400 మంది వీవీఐపీలు,మరో వెయ్యి మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం స్టేడియం ప్రాంగణంలో గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఇఫ్తార్ విందు తర్వాత అక్కడే నమాజ్ చేసుకొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షం పడే అవకాశం ఉండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐతే ఈ పార్టీకి 66 కోట్లు ఖర్చు చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.

అటు రాష్ట్రవ్యాప్తంగానూ 800 మసీదుల వద్ద ప్రభుత్వం ఇఫ్తార్ పార్టీ ఇవ్వనుంది. అందుకోసంఒక్కో మసీదుకు లక్షరూపాయల నిధులను మంజూరుచేసింది ప్రభుత్వం.ఇక నిరుపేద ముస్లిం కుటుంబాలకు మూడు జతల దుస్తులతో కూడిన రంజాన్ గిఫ్ట్ అందించింది. ఇఫ్తార్ విందులు, గిఫ్ట్‌ ప్యాక్‌ల కోసం 30 కోట్లకు పైగా వెచ్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐతే ఆ మొత్తాన్ని ముస్లిం సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుండని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: June 8, 2018, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading