Home /News /telangana /

PIL FILED AGAINST HIGHER CORONA TREATMENT FEES IN PRIVATE HOSPITALS IN TELANGANA HIGHCOURT SK

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ఫీజుల దోపిడీపై పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైకోర్టు, కేసీఆర్

హైకోర్టు, కేసీఆర్

జీవో ఉల్లంఘించిన ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలపాలంటూ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

    కరోనా ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే లక్షలకు లక్షలు ఖర్చవుతున్నాయి. వందల రూపాయల మందులిచ్చి.. బిల్లు మాత్రం లక్షల్లో వేస్తున్నారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చార్జీలపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని శ్రీ కిషన్ శర్మ అనే లాయర్ పిల్ దాఖలు చేశారు. కరోనా చికిత్స, చార్జీల్లో పారదర్శకతపై మార్గదర్శకాలు జారీచేయాలని ఆయన కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు... కరోనా చికిత్స చార్జీలపై ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయడం శోచనీయమని హైకోర్టు అభిప్రాయపడింది.

    జీవో ఉల్లంఘించిన ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలపాలంటూ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బిల్లు చెల్లించలేదనే కారణంతో డీఎంఓను డిశ్చార్జ్ చేయని ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది. అధిక ధరల వసూలు చేసిన నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది.

    ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షకు గరిష్టంగా రూ.2200 వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ధరలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక సాధారణ ఐసోలేషన్ ఛార్జి రోజుకు రూ.4000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూ ఛార్జి రోజుకు రూ.7500, వెంటిలేటర్‌తో ఐసీయూలో ఛార్జి రోజుకు రూ.9000గా ఖరారు చేశారు. ఇక యాంటీ వైరల్ మందులు వాడితే ఛార్జి అదనంగా ఉంటుంది. ఐతే ఈ రేట్లతో తాము చికిత్స ఇవ్వలేమని ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పినప్పటికీ.. ఖచ్చితంగా అదే రేట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐనప్పటికీ పలు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా లక్షల్లో ఫీజులు వసూలుచేస్తున్నాయి.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు