PIL : కమ్మ, వెలమ సంఘాల స్థలాల కేటాయింపుపై పిల్..

telangana-high-court

PIL : నగరంలో విలువైన భూములను కమ్మ, వెలమ సంఘాలకు కేటాయించడంపై హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. కాగా ఈ పిల్ ను స్వీకరించిన హైకోర్టు రెండు లేదా మూడు రోజుల్లో విచారించనుంది.

  • Share this:
    రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కమ్మ ,వెలమ సంఘాల భవన నిర్మాణాలకు కేటాయించిన భూమిపై హైకోర్టులో వరంగల్‌ కాకతీయ యూనివర్శిటి రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎ వినాయక రెడ్డి ఈ పిల్ ధాఖలు చేశారు. ఇది చట్ట నిబంధనలకు విరుద్దంగా ఉండడంతోపాటు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేదని ఆయన పిల్‌లో పేర్కోన్నారు.

    కాగా రాష్ట్రంలోని పలు కుల సంఘాలకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే కమ్మ, వెలమ సంఘాల భవన నిర్మాణానికి అయిదు ఎకరాల స్థలంతో పాటు అయిదు కోట్ల రూపాయలను కూడా కేటాయించింది.

    మరి కొన్ని కుల సంఘాలకు కోకాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కేటాయించి డబ్బులు కేటాయించింది.అయితే ఇతర కుల సంఘాలకు నగర శివారు కేటాయించి, ఉన్నత కులాలకు నగర నడిబొడ్డున స్థలాలు కేటాయించడం అది కూడా కోట్లాది రూపాయల విలువ చేసే భూములు కుల సంఘాల పేరుమీద కేటాయించడంపై ప్రతిపక్షాలతో పాటు ఇతర వర్గాల్లో విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయా స్థలాలపై పిల్ వేయడంతో మరోసారి భూముల కేటాయింపు వ్వవహారం చర్చకు రానుంది.

    కాగా ఇటివలే ప్రభుత్వం ఆర్ధిక కష్టాల నుండి బయట పడేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని హెచ్‌ఎండీఏ, టీఎస్ఐఐసి లకు చెందిన భూములును కోకపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో వేలం వేసింది. ఈ వేలంలో ఎకరా స్థలం 40 నుండి 60 కోట్ల రూపాయలకు అమ్మిన విషయం తెలిసిందే..
    Published by:yveerash yveerash
    First published: