హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కాంగ్రెస్ సీనియర్ నేతకు బెదిరింపు కాల్.. చంపేస్తామని వార్నింగ్

Telangana: కాంగ్రెస్ సీనియర్ నేతకు బెదిరింపు కాల్.. చంపేస్తామని వార్నింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: వి. హనుమంతరావును గుర్తుతెలియని వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడు.

  మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వీహెచ్‌ను గుర్తుతెలియని వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో వీహెచ్ సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

  నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని వీహెచ్‌ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్‌ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారని అన్నారు.

  Telangana news, v hanumantha rao news, phone call warning for v hanumantha rao, revanth reddy news, తెలంగాణ న్యూస్, వి హనుమంతరావు న్యూస్, వీహెచ్‌కు ఫోన్ కాల్ వార్నింగ్, రేవంత్ రెడ్డి న్యూస్
  వి.హనుమంతరావు(ఫైల్ ఫోటో)

  కాంగ్రెస్‌లో తాను సీనియర్‌ అని.. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని వీహెచ్ అన్నారు. తనకు 2018 నుంచి ఇప్పటి వరకూ సోనియాగాంధీని కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక వర్గం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై హైకమాండ్ ఆలోచన చేయాలని వీహెచ్ అన్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఓటమిపై రివ్యూ ఎందుకు చేయరని నిలదీశారు. రేవంత్ రెడ్డి టీడీపీని ఖతం పట్టించి, కాంగ్రెస్‌లో పడ్డారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తమని పిలిచి మాట్లాడాలని వీహెచ్ కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు. తమను కాదని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే... తమ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు.

  రేవంత్ మీడియాను పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు. రేపటి నుంచి టీఆర్‌ఎస్‌ తెలంగాణ వ్యతిరేకిని పీసీసీ చీఫ్‌ చేశారని ప్రచారం చేస్తుందని అన్నారు. బీసీగా ఉన్న డీ శ్రీనివాస్‌ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని వీహెచ్ గుర్తు చేశారు. మరోసారి టీపీసీీసీ చీఫ్‌గా బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Revanth reddy, Telangana, V Hanumantha Rao

  ఉత్తమ కథలు