హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లో పీజీ విద్యార్థి ఆత్మహత్య..

మాస్టర్ ఆఫ్ డిజైన్స్‌లో పీజీ చేస్తున్న ఆండ్రూ ఇటీవలే సెకండియర్ పరీక్షలు రాశాడు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 2, 2019, 7:04 PM IST
హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లో పీజీ విద్యార్థి ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ శివారులోని కందిలో ఉన్న ఐఐటీ క్యాంపస్‌లో విషాదం చోటు చేసుకుంది. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఉత్తరప్రదేశ్ వాసి మార్క్ ఆండ్రూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 2గం. ప్రాంతంలో హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి ఆండ్రూ గది తలుపులు తెరవకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చింది. దీంతో క్యాంపస్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డ ఆండ్రూ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్టు సమాచారం.కాగా, మాస్టర్ ఆఫ్ డిజైన్స్‌లో పీజీ చేస్తున్న ఆండ్రూ ఇటీవలే సెకండియర్ పరీక్షలు రాశాడు. జులై 5న ప్రజేంటేషన్ సమర్పించాల్సి ఉంది.

First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>