కరోనా కాలంలో పెట్రోల్‌పై ఎక్కువ పన్నులు వసూలు చేసిన కేంద్రం... షాకింగ్ లెక్కలు ఇవీ...

కరోనా కాలంలో పెట్రోల్‌పై ఎక్కువ పన్నులు వసూలు చేసిన కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)

Petrol, Diesel Price: కరోనా సమయంలో... రవాణా స్తంభించింది. అయినా సరే కేంద్రం భారీగా పన్నులు వసూలు చేసింది. ఆ లెక్కలు చూస్తే వామ్మో అనిపించకమానదు.

 • Share this:
  Petrol, Diesel Price: ఓవైపు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నూనెలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతుంటే... కేంద్ర ప్రభుత్వం... పన్నుల వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా లెక్కల్ని చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే... కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం భారీగా పన్నులు వసూలు చేయగలిగింది. పెట్రోల్, డీజిల్ ధరలపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్‌సభలో కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆ సమాధానమే ఇప్పుడు చర్చకు దారితీసింది. 2013లో పెట్రోల్, డీజిల్‌పై వచ్చిన పన్నులు ఎంత... గత మూడేళ్లలో కేంద్రం వసూలు చేసిన పన్నులు ఎంతో.... లెక్కలు చెప్పాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

  మూడేళ్లలో కేంద్రానికి పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంత్రి తన లిఖిత పూర్వక లెక్కల్లో వివరించారు. 2013లో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా రూ. 52,537 కోట్లు వచ్చాయని తెలిపారు. అలాగే... 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై రూ 2.13 లక్షల కోట్లు వచ్చాయన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.78 లక్షల కోట్లు పన్నుల కింద వచ్చినట్లు చెప్పారు. కరోనా జోరుగా ఉన్న సమయంలో... లాక్‌డౌన్ అమల్లో ఉన్న 2020-21 ఆర్తిక సంవత్సరంలో... అంటే... గత 11 నెలల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా 2.94 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసినట్లు మంత్రి తెలిపారు. నిజానికి ఈ సమయంలో రవాణా పెద్దగా లేదు. బస్సులు, లారీలు చాలా వరకూ ఆగిపోయాయి. అయినా సరే కేంద్రం ఈ స్థాయిలో వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే అంశం.


  ప్రస్తుతం దేశంలో పెట్రోలుపై రూ. 32.90, డీజిల్‌పై రూ. 31.80 ఎక్సైజ్ టాక్స్ వసూలు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. 2018లో పెట్రోల్‌పై రూ. 17.98, డీజిల్‌పై రూ. 13.83 ఎక్సైజ్ టాక్స్ ఉండేదని చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలను బట్టి... దేశీయంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను రోజువారీ డిసైడ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఐతే... రేవంత్ రెడ్డి మరో ప్రశ్న అడిగారు... ప్రపంచంలోనే పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక టాక్సులు విధిస్తున్నది భారతేనా అని అడిగితే... ఇండియా కంటే ఎక్కువ పన్నులు వేసే దేశాలు కూడా ఉన్నాయని ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.

  ఇది కూడా చదవండి:Viral Video: నువ్వా...నేనా... చెట్టుపై తలపడిన చిరుతపులి... నల్ల చిరుతపులి

  నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.96.45 ఉంది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.90.40 ఉంది. అలాగే విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ రూ.97.03 ఉండగా... డీజిల్ ధర రూ.90.58 ఉంది.
  Published by:Krishna Kumar N
  First published: