చైతన్యపురిలో కల్తీ పెట్రోల్‌.. మొరాయించిన పలు వాహనాలు...వాహనదారుల ఆందోళన

చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంక్‌ సమీపంలోగల హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో సోమవారం రాత్రి కొంత మంది వాహనదారులు పెట్రోల్‌ పోయించుకోగా పెట్రోల్‌ పోయించుకోగా వాహనాలు కొద్దిదూరం వెళ్లిన తరువాత నిలిచిపోయాయి. దింతో పలు ద్విచక్రవాహనాలు మొరాయించాయి. బంక్‌లో పెట్రోల్‌ పోయించుకొని కొద్ది దూరం వెళ్లగానే ఇంజన్‌ ఆగిపోవడంతో అవాక్కయారు. బైక్‌ లో నుంచి పెట్రోల్‌ బయటకు తీసి చూడగా అసలు విషయం బయటపడింది.

news18-telugu
Updated: July 23, 2019, 8:12 PM IST
చైతన్యపురిలో కల్తీ పెట్రోల్‌.. మొరాయించిన పలు వాహనాలు...వాహనదారుల ఆందోళన
చైతన్యపురిలో కల్తీ పెట్రోల్‌.. మొరాయించిన పలు వాహనాలు...వాహనదారుల ఆందోళన
  • Share this:
చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంక్‌ సమీపంలోగల హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో సోమవారం రాత్రి కొంత మంది వాహనదారులు పెట్రోల్‌ పోయించుకోగా పెట్రోల్‌ పోయించుకోగా వాహనాలు కొద్దిదూరం వెళ్లిన తరువాత నిలిచిపోయాయి. దింతో  పలు ద్విచక్రవాహనాలు మొరాయించాయి. బంక్‌లో పెట్రోల్‌ పోయించుకొని కొద్ది దూరం వెళ్లగానే ఇంజన్‌ ఆగిపోవడంతో అవాక్కయారు. బైక్‌ లో నుంచి పెట్రోల్‌ బయటకు తీసి చూడగా అసలు విషయం బయటపడింది. పెట్రోల్‌ సహజ రంగుకు బదులు కలుషిత నీటి రంగులో ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.. దీనితో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్‌లో నీరు, కిరోసిన్‌ను కలిపి కలుషితం చేయడం వల్లనే ఇంజన్‌ ఆగిపోయిందంటూ వాహనదారులు బంక్‌ వద్దకు చేరుకొని సిబ్బందిని నిలదీశారు. బంక్‌ ఆవరణలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో నిర్వాహకులు పెట్రోల్‌ బంక్‌ను మూసివేశారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, సోమవారం సాయంత్రం హెచ్‌పీ డిపో నుంచి పెట్రోల్‌ లోడ్‌ వచ్చిందని, దాన్నే వాహనాల్లో పోశామని చెప్పారు. సంబంధిత అధికారులు బంక్‌ను సీజ్‌ చేయాలంటూ ఆందోళకారులు డిమాండ్‌ చేశారు. బంక్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Video:-చైతన్యపురిలో కల్తీ పెట్రోల్‌.. మొరాయించిన పలు వాహనాలు...వాహనదారుల ఆందోళన

First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading