కరోనాతో ఆదాయం పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఖాజానాను నింపుకునేందుకు హెచ్ఎండీఎ పరిధిలోని భూములను అమ్మెందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు అనుగుణంగానే జీవోను జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విజయశాంతి వ్యతిరేకిస్తున్నారు. నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడం సమంజం కాదని ఆమె పేర్కోన్నారు.పిటిషల్లో హెచ్ఎండీఎతోపాటు, జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను కూడా ప్రతివాదులుగా ఆమె తన పిటిషన్లో చేర్చారు.
కాగా రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు భూములు అమ్మకాల మీదనే ప్రభుత్వం భారి ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే భూముల అమ్మకాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లోనే సమావేశం అయి ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. మొత్తం హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 120 ఎకరాల భూమిని అమ్మెందుకు సిద్దమైంది. ముఖ్యంగా టీఎస్ ఐఐసికి తోపాటు హెచ్ఎండీఏకి చెందిన కోకపేట ఐటెక్ సిటి సమీపంలోని సుమారు 15 ఎకరాలు, అమ్మాలని నిర్ణయించింది. దీంతో వీటి ద్వార సుమారు 1650 కోట్లు ప్రభుత్వానికి అదాయం రానున్నట్టు అంచనా వేసింది.
కాగా ఇందుకోసం నోటిఫికేషన్కూడా వెంటనే జారీ చేసింది. ప్రభుత్వ భూముల అమ్మకంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో అమ్మకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే విజయశాంతి పిటిషన్‌ను కోర్టు స్వీకరించి..విచారించినట్టయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అమ్మకాల ప్రక్రియ నిలిచే అవకాశాలు ఉంటాయి. అయితే గత ప్రభుత్వాలు కూడా భూముల అమ్మకాల ద్వార ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. మంత్రివర్గ నిర్ణయం ద్వార చేపట్టిన నిర్ణయాలను కోర్టులు అడ్డుకునేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.. ఏది ఏమైనా...పిల్‌ను విచారణ చేపడితే మాత్రం కొద్ది రోజులు అమ్మకాలకు బ్రేక్ పడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.