Home /News /telangana /

Diwali 2020: తెలంగాణలో టపాసులపై నిషేధం ఎత్తేయండి.. సుప్రీంలో పిటీషన్

Diwali 2020: తెలంగాణలో టపాసులపై నిషేధం ఎత్తేయండి.. సుప్రీంలో పిటీషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో టపాసులను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో లంచ్ పిటీషన్ దాఖలు చేసింది. క్రాకర్స్ ను బ్యాన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.

    దీపావళి సందర్భంగా తెలంగాణలో క్రాకర్స్ బ్యాన్ విధించాలని నిన్న హై కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ హై కోర్టు నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిది. పండగకు రెండు రోజుల ముందు ఇలా బ్యాన్ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో లంచ్ పిటీషన్ దాఖలు చేసింది. క్రాకర్స్ ను బ్యాన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోర్టును కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకులను నింపామని కోర్టు దృష్టికి వ్యాపారులు తీసుకెళ్లారు.  పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటీషన్ లో పేర్కొన్నారు.

    కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును పిటీషనర్ కోరారు. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది వ్యాపారులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటారని పిటీషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఎక్కడికి వెళ్లాలని క్రాకర్స్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. హై కోర్టు ఆదేశాలను సుప్రీం కొనసాగిస్తుందా? లేకా నిబంధనలతో క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తుందా అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

    రాష్ట్రంలో టపాసుల వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వెంటనే రాష్ట్రంలో ఉన్న టపాసుల దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాణసంబాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రజలు, సంస్థలు బాణసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు తెలంగాణ పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, సీపీల‌కు, రాష్ట్రంలోని పోలీసులకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తీసుకున్న చర్యలను నవంబర్ 16వ తేదీలోపు ప్రభుత్వానికి తెలుపాలని కోరింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Diwali 2020, Fire crackers, Supreme Court, Telangana Government, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు