Home /News /telangana /

PETITION FILED IN THE HIGH COURT AGAINST NEW YEAR CELEBRATIONS IN TELANGANA VRY

31st Celebrations : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ? వద్దంటూ హైకోర్టులో పిటిషన్..

ts high court

ts high court

31st Celebrations : నూతన సంవత్సర వేడుకల పంచాయితీ హైకోర్టుకు చేరింది. ఓ వైపు ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు మరో హైకోర్టు ఆంక్షలు ఉండగా... న్యూఇయర్ వేడుకలకు అనుమతి ఎలా ఇస్తారంటూ.. పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించారు.

    తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ పడింది. ముఖ్యంగా
    నూతన సంవత్సర వేడుకలపై హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కోంటూ.. ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు..

    ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్ననేపథ్యంలో...ఇతర రాష్ట్రల వలే.. ఆంక్షలు పెట్టాలని హై కోర్ట్ ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.. ఈ క్రమంలోనే ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కోర్ట్ కు తెలిపాడు.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని తెలిపాడు.. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని ,ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారించనుట్టు తెలిపింది..

    Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి. ఫలితంగా..

    కాగా మంగళవారం రాత్రి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31st డిశంబర్ ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రోజు పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని బార్లు,వైన్స్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం షాపులతో సహా,నగరంలో నిర్వహించే ఈవెంట్లకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

    Traffic challans : వామ్మో ఒక్క బైక్‌పై ఇన్ని చలానాలా..?... అవాక్కయిన లీసులు.

    మరోవైపు డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది. దీంతో అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు స్వేచ్చగా సంబరాలు చేసుకునే అవకాశం కల్పించినట్టయింది.. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి హైకోర్టు ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..కాగా ప్రభుత్వమే విధించిన ఆంక్షలు పక్కనబెట్టి, ఉత్సవాలకు అనుమతి ఇవ్వడంతో పాట మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: New Year 2022, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు