Home /News /telangana /

PETITION FILED IN TELANGANA HC TO CANCEL INTER FIRST YEAR EXAMS WHILE MINISTER SABITHA INDRA REDDY REVIEWS EXAM PREPARATION MKS

ts inter exams: పరీక్షలు రద్దు చేయండి -హైకోర్టులో పిటిషన్ -ప్రైవేటులో ఫీజులపై మంత్రి సబిత ఆగ్రహం

ఇంటర్ పరీక్షలపై వివాదం

ఇంటర్ పరీక్షలపై వివాదం

కరోనా పరిస్థితుల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయినప్పటికీ, ఆ విద్యార్థులందరికీ ఈనెల 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల ఏర్పాట్లపై మీటింగ్ పెట్టిన మంత్రి సబిత.. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఘాటుగా ప్రతిస్పందించాయి. మరోవైపు, పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది..

ఇంకా చదవండి ...
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల సన్నద్ధతపై గురువారం నాడు అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల్లో పాటించాల్సిన నిబంధనలు వెల్లడంచిన ఆమె.. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల దోపిడీపైనా కామెంట్లు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఘాటుగా స్పందించాయి. ఓవైపు పరీక్షల ఏర్పాట్లు చకచకా జరుగుతుండగా, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈక్రమంలోనే పరీక్షల రద్దుకు ఆదేశాలివ్వాలంటూ గురువారం నాడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.  వివరాలివి..

పైక్లాసుకు ప్రమోటైనా పరీక్ష తప్పదు
గతంలో కరోనా కారణంగా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని, రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయని మంత్రి సబిత తెలిపారు. మొత్తం 4.5లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నామని మంత్రి చెప్పారు.

ప్రైవేటు ఫీజులంపై మంత్రి ఫైర్ 
కరోనా నేపథ్యంలో ఈసారి పరీక్షా కేంద్రాలను 1750కి పెంచామని, డ్యూటీల్లో 25 వేల మంది ఇన్విజిలేటర్‌లు ఉంటారని, పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు గంట ముందు వచ్చినా కేంద్రంలోకి అనుమతిస్తామని మంత్రి వివరించారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ పంపిణీ మొదలైన క్రమంలో, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.315 కోట్ల బకాయిలివ్వండి..
ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని, పరీక్షల టైమ్‌లో పిల్లల్ని ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి సబిత సూచించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ ప్రతిస్పందించారు. ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్లపైన కాలేజీ ప్రిన్సిపల్ సంతకాన్ని ఆమోదించాలని మంత్రిని కోరారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం రూ.315 కోట్ల బకాయిలను చెల్లించడం లేదని, ఈ కారణంగా 300కుపైగా కాలేజీలు మూత పడ్డాయని చెప్పారు. తాము పంతాలకు పోవడం లేదని, ప్రభుత్వం పెద్ద మనసుతో కాలేజీల సమస్యలను పరిష్కరించాలని సతీష్ వేడుకున్నారు. మరోవైపు

పరీక్షల రద్దుకు హైకోర్టులో పిటిషన్
తెలంగాణలో ఇంటర్క ఫస్టియర్ పరీక్షల్ని రద్దు చేపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్ దాఖలైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఫస్టియర్ ప్రమోట్ అయి, సెకండ్ ఇయర్ చదువుతోన్న పిల్లలకు మళ్లీ ఫస్టియర్ పరీక్షలు పెట్టడమేంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల్ని రద్దు చేసి విద్యార్థులు అందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం.. ఆ పిల్లలు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతోంటే ఫస్టియర్ పరీక్షలు రాయాలనడం ఎంతవరకు సబబు అని కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిని పట్టించుకోని ప్రభుత్వం పరీక్షలపై ముందుకే వెళుతున్నది. 70 శాతం సిలబస్ తోనే ఫస్టియర్ పరీక్షలు పెడుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Intermediate exams, Sabitha Indra Reddy, Telangana, Telangana High Court

తదుపరి వార్తలు