Home /News /telangana /

PETITION FILED IN HRC ON BOREWELL DEATH IN MEDAK SK

బోరుబావి ఘటనపై HRCలో పిటిషన్.. వాళ్లే బాధ్యులు

120 అడుగుల వరకు బావి తవ్విన యజమాని నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేసినట్టు చెబుతున్నారు.

120 అడుగుల వరకు బావి తవ్విన యజమాని నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేసినట్టు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయని.. మెదక్ జిల్లా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది.

    మెదక్ బోరుబావి ఘటనపై హెచ్‌ఆర్‌సీలో మానవ హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనకు రెవెన్యూశాఖ అధికారులను బాధ్యులను చేయాలని కోరింది. అంతేకాదు బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హెచ్‌ఆర్సీసీని కోరింది. రెవెన్యూ అధికారులు కాసుల కక్కుర్తితో ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసేందుకు అనుమతిస్తున్నారని.. బోర్లు వేసిన తర్వాత కనీస పర్యవేక్షించడం లేదని ఆరోపించింది. బోరు పడకపోతే దాన్ని మూసివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. అధికారుల నిర్లక్ష్యంతోనే పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయని.. మెదక్ జిల్లా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది.

    మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడి చనిపోయిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం 05.45 గంటలకు ఆ చిన్నారిని బోరు బావిలో పడిపోయాడు. బాబును కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో.. గురువారం ఉదయం బోరుబావిలో 17 అడుగుల లోతు వద్ద మృతదేహాన్ని వెలికితీశారు. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

    బాలుడి తాత భిక్షపతి బుధవారం తన పొలంలో బోర్లు వేశాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో మూడో బోరు బావిని కూడా తవ్వించారు. ఆయన మనవడు సాయి వర్ధన్ కూడా తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చాడు. బోర్లు వేసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఆడుకుంటూ వెళ్లి ఓ బోరుబావిలో పడిపోయాడు సాయి వర్ధన్. వారి పొలంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Borewell, Medak, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు