పెంపుడు జంతువులను పెంచుకోవడం ప్రస్తుతం సర్వసాధారణం. జంతు ప్రేమికులు, చిన్నపిల్లలు ఇలా పెంపుడు జంతువులను బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో చాలా మంది పెట్స్ (pets)పై ఇష్ట చూపుతారు. తాజాగా జీహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (CDMA) అధికారులు తక్షణ పెంపుడు జంతువుల నమోదు కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా పెంపుడు జంతువుల నమోదు చాలా సులభతరం అవతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్ (Online) సౌకర్యాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ (Tweet) చేశారు.
Long weekends in 2022: ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఇవే.. ఎలా గడపాలో ప్లాన్ చేసుకోండి!
We @GHMCOnline and @cdmatelangana also are in the process of finalising a mobile based v simple app where the owner can upload basic details & have an instant registration done. (focus being ease & convenience)
We expect to introduce next month @KTRTRS @pfaindia @BlueCross_ https://t.co/6optmxy4Md
— Arvind Kumar (@arvindkumar_ias) January 19, 2022
“మేము @GHMCOnline మరియు @cdmatelangana కూడా మొబైల్ ఆధారిత సింపుల్ యాప్‌ను రూపొందిస్తున్నాం. ఈ యాప్‌లో యజమాని ప్రాథమిక వివరాలను అప్లోడ్ చేయవచ్చు. వేంటనే పెట్ డాగ్ వివరాలు జిస్ట్రేషన్ చేయవచ్చు. (సులభం & సౌలభ్యం కోసం దృష్టి పెట్టండి) వచ్చే నెలలో @KTRTRS @pfaindia @BlueCrossని ప్రారంభిస్తారని భావిస్తున్నాము, ”అని ఆయన ట్వీట్ చేశారు.
ముఖ్యంగా పెంపుడు జంతువులను పెంచుకొనే వారికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ (Registration Process) చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇకపై ఈ యాప్ (APP) వస్తే మరింత సులభంగా.. వారి సమస్య తీరిపోతుందని చాలా మంది పెట్ లవర్స్ చెబుతున్నారు.
GHMC ఇప్పటికే పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లో మార్చింది. ఈ మొబైల్ యాప్ పెంపుడు జంతువుల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. ఇంతకుముందు పెంపుడు జంతువులను నమోదు చేసుకోవాలనుకునే వారు మున్సిపల్ కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఆ సమస్య ఉండదు.
నోయిడాలో ఇప్పటికే ప్రారంభం..
దేశ రాజధానికి దగ్గరగా ఉండే నోయిడా (Noida) లో ఇప్పటికే పెట్ రిజిస్ట్రేషన్ యాప్‌ను ప్రవేశ పెట్టారు. దాని పేరు నోయిడా అథారిటీ పెట్ రిజిస్ట్రేషన్ (NAPR). ఈ రిజస్ట్రేషన్ యాప్‌లో పెంపుడు జంతువు ఫోటోను అప్లోడ్ చేసేలా రూపొందించారు. ఈ పెంపుడు జంతువుకు సంబంధించిన లైసెన్స్, ఫీజు చెల్లింపులు, నో అబ్జెక్షన్ లెటర్v(No Objection Letter) లో అన్ని ఈ యాప్ ద్వారానే నోయిడా అందిస్తోంది. పెంపుడు జంతువు తప్పిపోయినా.. దాని వల్ల ఇబ్బంది అయినా తదితర సమస్యలను పరిష్కారానికి ఈ యాప్ ఉపయోగపడేలా నోయిడా అథారిటీ రూపొందించింది. ఇక జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టే యాప్‌లోనూ ఇటువంటి ఫీచర్స్ ఉండాలని చాలా మంది కోరుకొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.