హోమ్ /వార్తలు /తెలంగాణ /

Pet dog Licence : జంతు ప్రేమికులకు షాక్.. ఇంట్లో కుక్కకు ఇక లైసెన్స్ కావల్సిందే... లేదంటే ...

Pet dog Licence : జంతు ప్రేమికులకు షాక్.. ఇంట్లో కుక్కకు ఇక లైసెన్స్ కావల్సిందే... లేదంటే ...

Pet dogs

Pet dogs

Pet dogs : పెట్ డాగ్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్,, ఇక నుండి జీహెచ్ఎంసీ వద్ద పెట్ డాగ్ రిజిస్ట్రేషన్ లేని వారికి భారిగా జరిమానాలను విధించేందుకు సిద్దమవుతున్నారు.. (Pet dog Registration ) అనధికారిక డాగ్స్ బయట పార్క్‌లలో కనిపిస్తే వారిపై 1000 నుండి 50 వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.

ఇంకా చదవండి ...

నగరంలోని జంతు ప్రేమికులకు హైదరాబాద్ నగరపాలక సంస్థ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇంట్లో కుక్కలను పెంచుకునే వారిపై కొరఢా ఝలిపించింది. ఎందుకంటే కుక్కలను పెంచుకునే వారు ఒకవేళ వాటి ఆరోగ్యం బాగాలేక పోయినా.. లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటిని రోడ్డుపై వదిలేస్తున్నారు.(Pet dog Registration ) దీంతో పబ్లిక్ సేఫ్టికి ఇబ్బందిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు..ముఖ్యంగా నగరంలో సుమారు 50 వేల పెట్ డాగ్స్ ఉంటే.. కేవలం 465 మాత్రమే జీహెచ్‌ఎంసీ వద్ద రిజిస్టర్ అయి లైసెన్స్ పొందారు.

ఇక నుండి లైసెన్స్ లేని డాగ్స్ ఓనర్స్ వాటిని పార్కుల్లో గాని, వీధుల్లోకి, ఇతర ఓపెన్ ప్రాంతాల్లోకి గాని, తీసుకువచ్చినట్టయితే..వారిపై చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల అతిక్రమణ కింద వెయ్యి రూపాయల నుండి 50 వేల రూపాయాల వరకు జరిమాన విధించనున్నారు. (Pet dog Registration )ఒకవేళ జరిమాన చెల్లించలేని పక్షంలో డాగ్‌ను స్వాధినం చేసుకోనున్నారు. జరిమాన చెల్లించిన తర్వాతనే దాన్ని విడుదల చేయనున్నారు. దీని ద్వారా వాటిని పెంచే యజమానులు బాధ్యతయుతంగా ఉండేందుకు దోహదపడుతుందని అధికారులు వెళ్లడించారు.

అధికారుల సమాచారం ప్రకారం నగరంలో సుమారు 50 వేల పెట్ డాగ్స్ ఉంటే వాటిలో కేవలం 465 మాత్రమే రిజిస్ట్రర్ అయి ఉన్నాయని తెలిపారు.(Pet dog Registration ) కాగా రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల వాటిని వ్యాక్సినేషన్‌తో పాటు వాటి రక్షణ, మెయింటెన్స్ ఇతరులకు ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపారు.

First Gay Marriage in Telangana : రికార్డ్... రాష్ట్రంలో ఇద్దరు మగాళ్ల మధ్య తొలి పెళ్లి...!


కాగా ఇలా పెట్ డాగ్స్ ఓనర్స్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి కావడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఆ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరముంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో వాటికి ఓ గుర్తింపు నంబర్‌తో పాటు వాటిలో చిప్‌తో కూడిని సమగ్ర సమాచారం పొందుపరుస్తారు.(Pet dog Registration ) దీనిద్వార పెట్ డాగ్స్‌ను సరిగా చూసుకోకుండా రోడ్డుపై వదిలివేసిన వారి డాటాను వెంటనే సేకరించి చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. లైసెన్స్‌లు పొందిన తర్వాత వాటిని అపార్ట్‌మెంట్లతో పాటు ఇతరులు కూడా ఎలాంటీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం ఉండదు.

రిజిస్ట్రేషన్ కోసం ఇలా చేయండి..

కాగా పెట్ డాగ్ రిజిస్ట్రేషన్ కోసం ముందుగా www. ghmc.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆవర్ సర్విసెస్ అనే ఆప్షన్ ఎంచుకొనొ అప్లికేషన్ ఓపేన్ చేసి అడిగిన వివరాలను ఫిల్ చేయాలి. (Pet dog Registration )ఇందుకోసం అడ్రెస్ ప్రూఫ్‌, 50 రూపాయల ఫీజును చెల్లించడంతో పాటు వ్యాక్సినేషన్, సర్టిఫికెట్, పక్కింటి వారి నో అబ్జెక్షన్ ధృవపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ నేరుగా వెటర్నరీ విభాగానికి వెళ్లి వెరిఫికేషన్ తర్వాత లైసెన్స్ ఇష్యు చేస్తారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: GHMC, Hyderabad

ఉత్తమ కథలు