Home /News /telangana /

PERMITION GRANTED TO THE FOOD DELIVERY BOYS IN LOCKDOWN VRY

Food Delivery : మంత్రి కేటిఆర్ దృష్టికి ఫుడ్‌ డెలివరి ఇష్యూ.... పోలీసులకు ఆదేశాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Food Delivery : ఫుడ్‌ డెలివరి సంస్థలకు లాక్డౌన్ నిబంధనల్లో అనమతి ఉందని, వారికి ఇబ్బందులు కల్గించవద్దని మంత్రి కేటీఆర్ పోలీసులకు సూచించారు..దీంతో డీజీపీ సైతం ఆదేశాలు జారీ చేశారు

లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు..పోలీసులకు ఏ ఆదేశాలు వచ్చినా..వాటిని తూచ తప్పకుండా వ్యవహరిస్తారు..దీంతో గత రెండు రోజులుగా నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు..ఆకారణంగా వస్తున్న వారిని నిలువరించి పోలీస్ పనిష్మెంట్ ఇవ్వడంతో పాటు మరికొంతమందికి జరిమానాలు విధించి పంపుతున్నారు..

అయితే కఠిన నిబంధనలతో అనుమతి ఉన్నవారిని కూడ పోలీసులు అడ్డుకోవడం అనేక పరిణామాలకు దారి తీస్తోంది.కేవలం అత్యవసర పనులు కోసం వస్తున్నవారిని ఐడి కార్డులు అనుమతుల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు..ఇలా ఏకంగా డాక్టర్లను సైతం వదల్లేదనే వార్తలు వెలువడ్డాయి..

కాగా రెండు రోజుల నుండి ఈకామర్స్ వ్యాపారానికి లాక్‌డౌన్ సంధర్భంగా అనుమతి ఉందని లాక్డౌన్ నిబంధనల్లో పేర్కోన్నారు..అయితే పోలీసులు మాత్రం ఫుడ్ డెలివరి బాయ్స్‌తో పాటు ఈకామర్స్‌‌లో వస్తువులను సప్లై చేసే వారిని సైతం అడ్డుకున్నారు.. అయితే ఇదే అంశాన్ని మంత్రి కేటిఆర్‌కు ఫుడ్‌డెలివరి సంస్థలు ట్వీట్టర్ ద్వార తెలిపాయి..దీంతో వెంటనే స్పందించిన కేటిఆర్ వారికి అనుమతి ఉందని ఇబ్బందులకు గురి చేయవద్దని పోలీసులకు సూచించారు..దీంతో విషయం తెలిసిన డీజీపీ సైతం స్విగ్గి, జొమాటో లాంటీ ఫుడ్‌డెలివరి బాయ్స్ అనుమతి ఉందని స్పష్టం చేశారు..దీంతో యథావిధిగా వారు విధులు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Hyderabad, Lock down

తదుపరి వార్తలు