హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Farmers: రైతులకు శుభవార్త.. త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం..

Telangana Farmers: రైతులకు శుభవార్త.. త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం..

సమావేశంలో మంత్రి, ఇతరులు

సమావేశంలో మంత్రి, ఇతరులు

Telangana Farmers: పొడుభూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతుందని, పోడు రైతులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.

  (K.Lenin,News18,Adilabad)

  తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని పోడు భూముల సమస్యకు(Problems) ప్రభుత్వం త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indra karan Reddy) అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నలుగురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిపి ఒక కమిటీ కూడా వేశారని చెప్పారు. ఈ కమిటీ సమస్యపై అధ్యయనం చేసి ఓ కొలిక్కి తెచ్చిందని వివరించారు. అటవీ సంరక్షణ, అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పోడు భూముల అంశంపై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.

  TSRTC MD Sajjanar : మరోసారి బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ.. ఆ నిర్ణయంతో ఆనందంలో ఆర్టీసీ ఉద్యోగులు..


  ఆయా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు, రెవెన్యూ, అటవీ తదితర శాఖల అధికారులు పాల్గొని పోడు భూముల సమస్య పై తమ తమ అభిప్రాయాలను తెలుపుతూ పలు సూచనలను చేశారు.  ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించిన అనంతరం ఒక్క అంగుళం అటవీ భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా వివిధ పార్టీలకు చెందిన నాయకులు,  వివిధ శాఖల అధికారులు బాధ్యతగా చూడాలన్నారు. నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాల అటవీ భూముల ఆక్రమణ జరిగిందని అన్నారు. జిల్లాలో 3 లక్షల 6 వేల 5 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉండగా,  19,543 ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఆక్రమణ కు గురైందన్నారు.

  So Sad: మంత్రి పక్కన ఫొటో దిగుతున్న వ్యక్తిని చూశారా.. అతడు చేసిన పని తెలిస్తే చెప్పు తీసుకుంటారు.. ఏం చేశాడంటే..


  జిల్లాలో ఖానాపూర్, ముథోల్, సారంగాపూర్, మామడ, కుబీర్ మండలాలో ఎక్కువగా ఆక్రమణ జరిగిందని మంత్రి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల 47 వేల 559 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండగా, జిల్లాలో 17 వేల 657 మందికి 69 వేల 654 ఎకరాల అటవీ హక్కు పత్రాలను అందజేశామన్నారు. నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు గ్రామ స్థాయిలో కమిటీలు పోడు భూములు సాగు చేసే వారి వివరాల జాబితాను డివిజన్ స్థాయి అధికారుల కమిటీకి అందజేయాలని, డివిజన్ కమిటీ వాటిని పరిశీలించి జిల్లా కమిటీకి అందజేయాలని  మంత్రి సూచించారు.  కింది స్థాయి కమిటీల నుండి వచ్చిన  క్లెయిమ్స్ లను పరిశీలించి జిల్లాస్థాయి కమిటీ ఫైనల్ పట్టా ఇస్తారని తెలిపారు. అందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.

  Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


  ఇకపై భవిష్యత్తులో ఒక అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా ట్రెంచ్ లు ఏర్పాటు చేసి కచ్చకాయల  చెట్లు నాటాలని తెలిపారు.  మంత్రి సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రెవెన్యూ, ఫారెస్ట్, ఎక్సైజ్ తదితర  అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అడవులుంటే మానవ  మనుగడ ఉంటుందని, మనిషికి జీవించడానికి ఆక్సిజన్ అందుతుందన్నారు. అడవుల ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం  హరితహారం కింద 230కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు.

  4%  పచ్చదనం పెరిగిందన్నారు. నశించిన అడవుల స్థానంలో అటవీ శాఖ ద్వారా అడవుల అభివృద్ధి చేపడుతుందన్నారు. ఈ సమావేశాల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పరిషత్ ల చైర్మన్ లు కె. విజయలక్ష్మీ, జనార్ధన్ రాథోడ్, ఆదిలాబాద్, బోథ్,  ఖానాపూర్, ముథోల్ శాసన సభ్యులు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, రేఖానాయక్,  జి. విఠల్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Forest, Minister indrakaran reddy

  ఉత్తమ కథలు