హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కరోనా పరీక్షకు వెళ్తున్నారా.. అయితే ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి..

Telangana: కరోనా పరీక్షకు వెళ్తున్నారా.. అయితే ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి..

Telangana: కరోనా లక్షణాలు లేకున్నా అనవసరంగా టెస్టులు చేయించుకుంటున్నారని మహబూబ్ నగర్ వైద్య అధికారులు తెలిపారు. దీంతో అవసరం ఉన్నవారికి ఇబ్బదులు వస్తున్నాయని.. వారి దగ్గరకు వచ్చే సరికి కిట్స్ అయిపోతున్నాయన్నారు. ఇకనుంచి ఎవరైనా కరోనా పరీక్షలు చేయించుకునే వారికి ప్రత్యేక నిబంధనలను జారీ చేశారు.

ఇంకా చదవండి ...

  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  ఏమాత్రం కరోనా లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్య శాఖ నిబంధనలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోజుకు 11, 500 పరీక్షలు చేస్తుంటే అందులో 500 నుంచి 800 వందల వరకు కేసులు వస్తున్నాయి. మిగతా వారికి నెగిటివ్ వస్తుంది. దీంతో 80% కిట్లు వృధా అవుతున్నాయి. ఏమాత్రం సందేహం ఉన్నా చాలామంది కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అందులో నెగిటివ్ వచ్చాక ప్రశాంతంగా ఉంటున్నారు. కొద్దిగా లక్షణాలు ఉన్నవారు వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, జలుబు, దగ్గు, ఆయాసం, ఒళ్ళు నొప్పులు, విరోచనాలు , కళ్ళు ఎర్రగా మారడం తదితర లక్షణాలు ఉండి ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ లక్షణాలు లేని వారికి ఇకనుంచి కోవిడ్ పరీక్షలకు అనుమతించేది లేదని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో కరోనా కిట్టు ఉంటే మరికొన్నిచోట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

  అచంపేట్, కొల్లాపూర్, ఆత్మకూరు, గోపాలపేట, పానగల్, కోయిలకొండ, బాలనగర్ మిడ్జిల్ గట్టు, తదితర ప్రాంతాలలో కరోనా ర్యాపిడ్ కిట్ల కొరత ఎక్కువగా ఉందన్నారు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు వెళ్ళిన వారు కిట్లు లేక నిరాశగా వెనక్కి వెళ్ళి పోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఏప్రిల్ 26న 9,600 ర్యాపిడ్ కిట్లు వచ్చాయి. అందులో 1500 వినియోగం కాగా మిగతావి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిల్వ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుతానికి వారి వద్ద నిల్వలు లేవు. ఉన్నవాటిని ఆయా పి హెచ్ సి లు ఇతర ఆసుపత్రులకు పంపించారు. అందులోనూ కొన్ని పీహెచ్సీల్లో కిట్లు ఉంటే కొన్నిట్లో లేవు. త్వరలో 10 వేల కిట్లు వరకు ఆ జిల్లాకు రానున్నాయి.

  వనపర్తి జిల్లాలో కరోనా కిట్లు వచ్చాయి. నారాయణపేట జిల్లాలో ఆరువేల ర్యాపిడ్ కిట్లు వచ్చాయి. అందులో ఇప్పటివరకు సగానికి పైగా కిట్లు వినియోగించ గ మరి కొన్ని కిట్లు సిద్ధంగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా లో ఆరువేల కిట్ల గాను మరో మూడు వేలు సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కరోనా కిట్ల కొరత లేదని.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో లేవని మహబూబ్ నగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ తెలిపారు. అవసరమైన వారికి.. కరోనా లక్షణాలు కనిపించే వారికి మాత్రమే పరీక్షలు చేయాలని ఆయన అన్నారు.

  First published:

  Tags: Corona cases, Corona positive, Mahabubnagar, New rules corona test, Telangana

  ఉత్తమ కథలు