దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసుల తప్పు ఏ మాత్రం లేదని పలువురు అఫిడవిట్లు ఇచ్చారు. షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయానికి బుధవారం ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లి ఈ మేరకు అఫిడవిట్లు సమర్పించారు. దిశపై అత్చారం చేసి అతి దారుణంగా కాల్చివేసిన సంఘటనలో పట్టుబడిన నిందితుల వ్యవహారం, జరిగిన సంఘటనపై క్షుణ్ణంగా అధ్యయనం చేశామని... ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నామని పలువురు అఫిడవిట్లలో పేర్కొన్నారు.
దిశ సంఘటనలో నిందితులుగా ఉన్న నలుగురు కరుడుగట్టిన నేర స్వభావం కలిగినవారని వివరించారు. దిశను కాల్చివేసిన సంఘటనా స్థలానికి తీసుకువచ్చిన సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సంఘటనలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయినట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎన్‌కౌంటర్ ఘటన విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha, Disha accused Encounter, Telangana, Telangana Police