Home /News /telangana /

PEOPLE OF NIZAMABAD ARE DEMANDING TO RENAME NIZAMABAD AS INDUR SAYS BJP MP ARVIND SK

నిజామాబాద్‌ పేరును మార్చాల్సిందే: బీజేపీ ఎంపీ అరవింద్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన తండ్రి శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరి మోదీకి మద్దతిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు అరవింద్.

  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం పేరుతో నిజామాబాద్‌కు దరిద్రం పట్టుకుందని..పేరు మార్చితేనే జిల్లా బాగుపడుంతుందని అభిప్రాయపడ్డారు. ప్రజందరూ బాగుపడాలంటే నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని అన్నారు. సోమవారం పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అరవింద్. తన తండ్రి శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరి మోదీకి మద్దతిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.

  ఇందూరు అనే పేరును నిజాం మార్చాడు. HINDUSTAN లోని INDU, INDIAలోని IND అక్షరాలు INDURలో ఉన్నాయి.  ఇంతటి పవిత్రమైన పేరును నిజామాబాద్‌గా మార్చారు.  నిజాంపేరును దేనికి పెట్టినా దరిద్రమే. నిజాంసాగర్‌లో నీళ్లు లేవు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. నిజామాబాద్ రైతులు బాగుపడరు. మనకు మంచి భవిష్యత్ ఉండాలంటే నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాల్సిందే.
  ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ
  కాగా, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలు నగరాల పేరును మార్చిన విషయం తెలిసిందే. అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా, మొగల్‌సారాయ్ జంక్షన్‌ను దీన్ దయాల్ ఉపాధ్యాయగా మార్చారు. అదే బాటలో తెలంగాణలోనూ పలు ప్రాంతాల పేర్లను మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
  First published:

  Tags: Bjp, Dharmapuri Arvind, Nizamabad, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు