హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gangavva: ఆ పెద్దావిడ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తగ్గేదేలే .. గంగవ్వ మజాకా

Gangavva: ఆ పెద్దావిడ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తగ్గేదేలే .. గంగవ్వ మజాకా

(గంగవ్వ ఫ్యాన్‌ ఫాలోయింగ్)

(గంగవ్వ ఫ్యాన్‌ ఫాలోయింగ్)

Big boss Gangavva : ఆమె వృద్దురాలే అయినా సెలబ్రిటీనే. పల్లెటూరులో పుట్టిన ఆమెను చూస్తే జనం వదలిపెట్టరు. ఒక్కసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి వచ్చిందో లేదో పాపులారిటీ మరింత పెరిగింది. ఇప్పుడు గోదావరి తీరానికి వెళితే అక్కడ ఫ్యాన్స్‌ ఆమెను సెల్ఫీల కోసం ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది సరిగ్గా ఉపయోగించుకుంటే పబ్లిక్‌లో పాపులారిటీ దానంతట అదే వస్తుంది. లేదంటే అవతలి వ్యక్తులు ఆ టాలెంట్‌(Talent)‌ని గుర్తించి వెలికి తీసినా ఆ వ్యక్తులకు సమాజంలో ఓ హోదా దక్కుతుంది. వయసు, ప్రాంతం, చదువు, అందం ఎలాంటివేమి లేకపోయినా పబ్లిక్‌లో ఆమె పేరు చెబితే ఓ క్రేజ్. ఆమె కనిపిస్తే అరే మన గంగవ్వ(Gangavva) అని పిలిచేంత సాధారణ వృద్దురాలు ఆమె. అందుకే ఆమె గోదావరి తీరంలో షూటింగ్‌ (Shooting)కోసం వెళ్తే జనం వదిలిపెట్టలేదు. 60ఏళ్ల వయసు కలిగిన గంగవ్వ పిల్లలు, యువకులతో కలిసి షార్ట్ ఫిల్మ్‌(Short film)‌లో నటిస్తూ యూట్యూబ్ చానల్(YouTube channel)ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో(Bigg Boss Show)ద్వారా మరింత మంది ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్నారు గంగవ్వ.

గంగవ్వ మజాకా..

నిర్మల్ జిల్లా జన్నారం మండలం చింతగూడలోని గోదావరి తీరంలో సందడి చేసింది గంగవ్వ. అక్కడున్న లక్ష్మీదేవి ఆలయానికి గంగవ్వ మై విలేజ్ షో బృందం సభ్యులతో కలిసి వెళ్లింది. సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. లక్ష్మీదేవిని దర్శించుకొని వస్తుండగా అక్కడే గంగవ్వ కనిపించడంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కాసేపు ఆమె పక్కన కూర్చొని ముచ్చటించారు.

( గంగవ్వ క్రేజ్ )
( గంగవ్వ క్రేజ్ )

సెలబ్రిటీ స్టేటస్..

మై విలేజ్ షో దర్శక, నిర్మాత అయిన శ్రీకాంత్ సోదరి కొడుకు కేశఖండనం కోసం లక్ష్మీదేవి ఆలయానికి వచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పుట్టెంట్రుక తంతును పూర్తి చేసుకున్నారు. వారితో పాటే గంగవ్వ కూడా ఆలయానికి రావడం చూసిన భక్తులు సంబరపడిపోయారు. మహిళలు, పిల్లలు గంగవ్వ చుట్టూ చేరారు. గంగవ్వ కూడా వారితో కాసేపు ముచ్చటించడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఓ సెలబ్రిటీ వచ్చినంత పనైంది.

సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఆసక్తి..

ఇంట్లో కూర్చొని మనవలు, మనవరాళ్లతో కాలంక్షేపం చేయాల్సిన వయసులో గంగవ్వ మీడియా, సోషల్ మీడియా, టీవీ షోలు, రియాల్టి షోలు, యూట్యూబ్‌ చానల్‌ కార్యక్రమాలతో తెగ బిజీ అయిపోయింది. గత కొద్ది రోజుల క్రితం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒకానొక కంటెస్టెంట్‌గా ఎంపికై నాలుగు వారాలకుపైగా హౌస్‌లో ఉండి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. మాట, కట్టుబొట్టు అంతా గ్రామీణ ప్రాంతానికి చెందినట్లుగా ఉండే గంగవ్వ నాచురల్‌గా నటించడంతో ఆమెకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎక్కడికైనా వెళ్తే హీరోలు, హీరోయిన్‌లు, రాజకీయ నాయకులతో సెల్ఫీలు దిగినట్లుగా గంగవ్వతో కూడా అన్నీ వయసుల వాళ్లు సెల్ఫీల కోసం పోటీ పడుతుంటారు. నిర్మల్ జిల్లాకి గంగవ్వ వెళ్లిన సందర్భంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆ ఫోటోలే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

First published:

Tags: Gangavva, Telangana News

ఉత్తమ కథలు