PEOPLE OF KARIMNAGAR TOWN CELEBRATE DIWALI AT GRAVEYARD VRY
Diwali at graveyard : సమాధుల వద్ద దీపావళీ.. పూజలు చేయడం.. టపాసులు పేల్చడం.. అన్ని అక్కడే..
Diwali at graveyard : సమాధుల వద్ద దీపావళీ.. పూజలు చేయడం.. టపాసులు పేల్చడం..
Diwali at graveyards : దీపావళీ పర్వదినాన్ని సమాధుల వద్ద నిర్వహించుకోవడం అక్కడ వారి ఆనవాయితి. పండగ రోజు ఎక్కడ ఉన్నా.. పూర్వీకుల సమాధుల వద్దకు చేరుకుని చుట్టూ దీపాలు వెలిగించి, ప్రత్యేక వంటకాలు ఉంచుతారు..
దేశంలోని పలు పండగలు ఓక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయం ఆచారాలతో నిర్వహిస్తారు.. అయితే నిర్వహించే పండగ ఒక్కటే అయినా.. అక్కడ ఆచరించే పద్దతులే వేరుగా ఉంటాయి.. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్దతులను పాటిస్తారు. కాగా దీపావళీ అంటే దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్ష్మి పూజలు చేస్తూ... కుటుంబ సభ్యులతో టపాసులు పేల్చుతారు. కొంత మంది గిరిజన గూడాల్లో ప్రత్యేకంగా గుస్సాడి డాన్సులు చేస్తూ ప్రత్యేకంగా పండగను జరుపుకుంటారు. మరి కొన్ని చోట్ల దీపావళీ పండగనాడు లక్ష్మి దేవి రావాలని పూజలు చేస్తే.. మరి కొన్ని చోట్ల లక్ష్మి ఇంట్లో ఉండకూడదు అని పూజలు చేస్తారు.. ఇలా రకరకాలుగా దేవుళ్లను పూజించే కార్యక్రమాలు కొనసాగుతాయి.. కాని కరీంనగర్లో మాత్రం కొంతమంది తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేసి దీపావళీ జరుపుకుంటున్నారు..
సాధారణంగా చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా పూజల, కర్మలు చేస్తారు.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొంతమంది ప్రజలు మాత్రం ఏకంగా దీపావళీనే సమాధుల వద్ద నిర్వహిస్తారు.. దివాళీ రోజున సాయంత్రం సమాధులను శుభ్రపరిచి వాటి చుట్టు దీపాలను అమర్చుతారు. ఇంట్లో ప్రత్యేక చేసిన వంటకాలను సమాధి వద్ద ఉంచుతారు. అనంతరం సమాధుల వద్దే టపాసులు పేల్చి ఉత్సవాలు చేసుకుంటారు. ఇలా తమ వారిపై ఉన్న అభిమానాన్ని , సాంప్రదాయాన్ని అక్కడి స్థానికులు కొనసాగిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్‌లోని జలౌన్ గ్రామస్తులు కూడా ప్రతి ఏడాది లాత్మార్ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు. అంటే దీపావళి నాడు ఆ గ్రామంలో ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు. జలౌన్ గ్రామానికి చెందిన ప్రజలు ఎప్పటిలాగే లాత్మార్ దీపావళి చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే ముందుగా గ్రామస్తులంతా ఒకచోట చేరారు. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి నృత్యాలు చేశారు. ఆపై ఒక గ్రూప్‌పై మరో గ్రూప్ కర్రలతో దాడి చేసుకున్నారు.కాగా, ఈ లాత్మార్ దీపావళి తాము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్ గ్రామస్తులు తెలుపుదున్నిరు...కాగా ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారంతా 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులే ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.