Home /News /telangana /

PEOPLE ARE ADMITTED TO HOSPITALS WITH TOXIC FEVER IN THE JOINT MAHABUBNAGAR DISTRICT SNR MBNR

Telangana : కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్న పాలమూరు జిల్లా ప్రజలు.. వాళ్లతో ఆసుపత్రులు ఫుల్

Seasonal diseases: అక్కడ విష జ్వరాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇంట్లో ఉండే వాళ్ల కంటే ఆసుపత్రుల్లో చేరే వాళ్ల సంఖ్యే ఎక్కవగా ఉంది. వాతావరణ ఒక్కసారిగా చల్లబడడంతో దోమలు పెరగడంతో అనేక రకాల జ్వరాలు జనంపై దాడి చేస్తున్నాయి.

Seasonal diseases: అక్కడ విష జ్వరాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇంట్లో ఉండే వాళ్ల కంటే ఆసుపత్రుల్లో చేరే వాళ్ల సంఖ్యే ఎక్కవగా ఉంది. వాతావరణ ఒక్కసారిగా చల్లబడడంతో దోమలు పెరగడంతో అనేక రకాల జ్వరాలు జనంపై దాడి చేస్తున్నాయి.

Seasonal diseases: అక్కడ విష జ్వరాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇంట్లో ఉండే వాళ్ల కంటే ఆసుపత్రుల్లో చేరే వాళ్ల సంఖ్యే ఎక్కవగా ఉంది. వాతావరణ ఒక్కసారిగా చల్లబడడంతో దోమలు పెరగడంతో అనేక రకాల జ్వరాలు జనంపై దాడి చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
    (Syed Rafi, News18,Mahabubnagar)
    వర్షాకాలంలో ఈ మధ్య వర్షాలు వరుసగా కురుస్తుండటతో విష జ్వరాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పాలమూరు జిల్లాలో వరుసగా వర్షాలు కురుస్తునంతో విష జ్వరాలు(Poisonous fevers) విపరీతంగా పెరిగాయి. వాతావరణ ఒక్కసారిగా చల్లబడడంతో దోమలు(Mosquitoes)పెరగడంతో ఆనేక రకాల వైరల్ ఫీవర్స్‌ (Viral fevers)తో రోగులతో ప్రభుత్వ(Government),ప్రైవేట్ ఆసుపత్రు(Private hospital)లు కిక్కిరిసిపోతున్నాయి.ఇప్పుడు మహబూబ్‌నగర్Mahabubnagar జిల్లాలోని ప్రధాన ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది తప్ప డిశ్చార్జ్ అయ్యే వాళ్లే లేకుండా పోతోంది.

    Crime news : ఇద్దరు కవల పిల్లలకు విషం తాగించిన కన్నతల్లి .. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు



    విజృంభిస్తున్న విషజ్వరాలు..
    ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షా లు ప్రారంభమైన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా జనం సాధారణ జ్వరాలతో పాటు టైఫాడ్‌, డెంగ్యూ, మలేరియాకేసులు కూడా పెరుగుతున్నాయి. జ్వరాలు బారిన పడినవారు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే దుంపలను మరొకరి పీల్చడంతో వైరల్ జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి. కలుషిత ఆహారం తినడం, నీరు తాగడం గాలి పీల్చడం వల్ల కూడా టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఒక్క నెలలోనే 60 మందికి పైగా విష జ్వరాలు బారిన పడిన వారు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇప్పుడు రోజుకు ఏడుగురు చొప్పున చేరుతున్న ఒక్క ప్రభుత్వ జనాల ఆసుపత్రిలోనే ఇలా ఉంటే ప్రైవేటు ఇతర ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.



    ఆసుపత్రుల్లో బెడ్స్ ఫుల్..
    గ్రామాల కంటే పట్టణాల్లో జ్వరాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. మురికివాడలు, మురుగు నీరు నిలిచే ప్రదేశాలతో పాటు తాగేనీరు పైపులైను లీకేజీలతో విషజ్వరాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు, బండిమీదపల్లి, రామయ్య పోలీస్, శివశక్తి నగర్ ,వీరన్నపేట, టిటిగుట్ట, శేషగుట్ట ప్రాంతాల్లో విషజ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా కేంద్రంలో పరిశుభ్రత పూర్తిగా పడకేసింది. దీంతో రోడ్లు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో అపరిశుభ్రం పెరిగిపోయి దోమలు, క్రిమీ కీటకాలు, దోమలు జనంపై దాడి చేస్తున్నాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజావైద్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికి ఉపయోగం లేకుండా పోతోందని స్థానికులు మండిపడుతున్నారు. జూన్ ఆరంభంలో 16 రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు పల్లె పట్టణ ప్రగతి పనులను చేపట్టారు. పూరపాలకలు, గ్రామపంచాయతీలకు కలిపి 18.23 కోట్లను ఖర్చు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్యం ఆర్థిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముగిసిన పక్షం రోజులు గడుస్తున్న పట్టణాలు గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. వాతావరణం అపరిశుభ్రంగానే ఉంది.

    CWG 2022: పంచ్‌లతో పతకాలు సాధించిన నిఖత్,హుస్సాముద్దీన్ ..కామన్‌వెల్త్ గేమ్స్‌లో నిజామాాబాద్ రత్నాలు


    ఏట రు .కోట్లలో ఖర్చు...
    ఏటా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దోమకాటు కాలుష్యం జలాలతో సుమారుగా మూడు లక్షల మంది వివిధ జ్వరాలతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరాలతో ఆసుపత్రికి వెళ్లిన రోగి సగటున రూ 5000 ఖర్చు చేయాల్సి వస్తుంది ల్యాబ్‌లో రక్త మూత్ర పరీక్షల పేరుతో 2500 వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వైద్యుల ఫీజులు మందుల ఖర్చు వేరేసి మరో 2500 ఖర్చు అవుతుంది. డెంగ్యూ తీవ్రతను బట్టి 20, వేలు నుంచి 50 వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏటా దోమకాటు కాలుష్య జలాలను తాగడం వల్ల వచ్చిన జురాల కోసం సుమారు రూ.193 కోట్ల వరకు జనం తమ జేబులు నుంచి తెచ్చిస్తున్నారు. దీంతోపాటు ఇళ్లలో దోమల నివారణ మందులు, పరికరాల కోసం 61 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ప్రజలకు పూర్తిగా వైద్యసేవలు అందేలా చూడాలని అలాగే పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Mahabubnagar, Telangana News

    తదుపరి వార్తలు