జయహో తెలంగాణ పోలీస్

దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారని ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: December 6, 2019, 10:48 AM IST
జయహో తెలంగాణ పోలీస్
దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారని ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు.
  • Share this:
దిశ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారని ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో జరిగిన ఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ అత్యాచారం చేయబడ్డ బాధితురాలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతుండగా నిందితుడు బాధితురాలిపై పెట్రోల్ పోసి అతి క్రూరంగా చంపాడు.కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు దానికి భిన్నంగా నిందితులనే కాల్చి చంపారు.

వరంగల్ లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచార నిందితుడికి పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరి శిక్ష విధించేలా పక్కా ఆధారాల్తోచర్యలు తీసుకున్నారు కానీ దాన్ని హై కోర్ట్ కొట్టివేస్తూ ఉరి శిక్షను కాస్త యావజ్జీవ శిక్షగా మార్చింది.  ఏది ఏమైనా ఈ సంఘటనతో  కొన్ని విషయాల్లో న్యాయస్థానాలతో  ప్రజలకు న్యాయం జరగదని.. అలాంటి వాటిలో పోలీసులతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ పోలీసుల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందిస్తున్నారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>