Home /News /telangana /

PENDING SSC EXAMS IN TELANGANA WILL BE HELD FROM JUNE 8 AK

తెలంగాణలో జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana SSC Exams: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)
    జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ) పరీక్షలను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గ్యాప్ ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యార్థులెవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వారికి ప్రత్యేక గదులను కేటాయించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2500 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

    మూడు రోజుల క్రితం పదో తరగతి పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు... జూన్ 8 నుంచి ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని సూచించింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఇవ్వాలని సూచించింది. ఇప్పుడున్న పరీక్ష కేంద్రాలకు రెట్టింపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పరిశుభ్రత పాటించే విధంగా సానిటైజర్స్‌ను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశమిచ్చింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించింది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ssc exams, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు