Home /News /telangana /

PEDDAPALLI ZP CHAIRMAN PUTTA MADHU ONCE AGAIN DISAPPEARED VRY KNR

Peddapalli : పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యం.. !

putta madhu

putta madhu

Peddapalli : పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యమయ్యారు . గత రెండు రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు . ఎవరికీ అందుబాటులో లేరు . కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారన్న వివరాలు చెప్పలేదు .దీంతో ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు..

ఇంకా చదవండి ...
    పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధు (putta Madhu )మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.. గత నాలుగు నెలల క్రితం ఈటల రాజేందర్ (Eetala rajender )పార్టీ మారిన తర్వాత ఆయన వారం రోజుల పాటు కనిపించకుండా పోవడంతో సంచలనంగా మారింది. అయితే మరోసారి అదృశ్యం అయినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆయన ఆచూకి తెలియడం లేదు.. ఎవరు అందుబాటులో కూడా లేకపోవడతో పాటు ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలను సైతం ఇంటిదగ్గరే వదిలిపెట్టారు . గతంలోనూ ఆయన ఇలాగే కనిపించకుండా పోతే పోలీసులే ఆయనను ఆంధ్ర ప్రదేశ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు .

    తాజాగా మరోసారి ఆయన కనిపించకుండా పోయారు . ముఖ్యంగా హైకోర్టు న్యాయవాదులు( Advocates) దంపతులు గట్టు వామన్ రావు , ఆయన సతీమణి నాగమణిల హత్యలో ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి హత్య తర్వాత కొద్ది రోజులకు రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన అదృశ్యం అయిన సంఘటన వెలుగు చూసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే న్యాయవాద దంపతుల హత్యపై మరింత లోతుగా పోలీసులు విచారించారు.. పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చడం.. . ఈ హత్యకు ప్రధాన సూత్రధారి పుట్ట మధు అనే ఆరోపణలున్నాయి . అయితే వీటిని ఆయన ఖండించినా.. ఆ తర్వాత ఈ కేసులో పుట్ట మధు నిందితుడిగా ఉన్నారు . ఈ హత్యపై స్పందించిన హైకోర్టు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు (fast track court)ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది.

    ఇది చదవండి :రెండు రోజుల్లో పెళ్లి, అమ్మాయితో పాటు మధ్యవర్తి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది..కారణం ఇదే..


    ఇది చదవండి : నాదే తప్పు... జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ రంగంలోకి..


    అయితే కొద్ది రోజుల తర్వాత ఈటల రాజేందర్ రాజీనామా చేయడం ఆయనకు అనుచరుడిగా ఉన్న పుట్టమధుకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దీంతో న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుపై ఫోకస్ పెట్టారు. ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వకుండా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున ఆయన పై ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ఆయన ఆంధ్రాలో షెల్టర్ తీసుకున్న పరిస్థితి తలెత్తింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుండగా ఆయన మరోసారి అదృశ్యం అవడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Peddapalli, Putta madhu, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు