Home /News /telangana /

PEDDAPALLI ZILLA PARISHAD CHAIRMAN PUTTA MADHUS DISAPPEARANCE MYSTERY IS NOT OVER YET IN TELANGANA VB KNR

Telangana: అజ్ఞాతంలోనే ఆ కీలక నేత.. ఇంకా వీడని మిస్టరీ.. అసలేం జరుగుతోంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం ఇంకా వీడలేదు. అతని భార్య పుట్ట శైలజ ఈ విషయమై అపాయింట్ మెంట్ కోరగా సీఎం నిరాకరించినట్లు తెలిసింది. దీంతో మంథని నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    (పి. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా, న్యూస్18 తెలుగు) 

    పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది . మాజీమంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు . చైర్మన్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండగా , ఆయన ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు చెపుతున్నా రు . అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన మంథని లో ఏం జరుగుతోందో కూడా పోలీసులకు తెలియ కుండా ఉంది . నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లతో పుట్ట మధుకు రక్షణ కల్పిస్తున్న రామగుండం పోలీసులు ఇంత జరుగుతున్నా .. మధు ఎక్కడికి వెళ్లలేదని , దేశంలోనే ఉన్నారని చెబుతూ వచ్చారు . ఆయనకు రక్షణగా గన్‌మెన్లు కూడా వెంటే ఉన్నారని సీపీ వి.స త్యనారాయణ స్వయంగా చెప్పారు . ఏఆర్ ఏసీపీ సుందరరావు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు . ఎన్ని పుకార్లు షికార్లు చేసినా ... పోలీసులు చెపుతున్న దానిని బట్టి పుట్ట మధు దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన బంధువుల దగ్గరో .. సన్నిహితుల వద్దే ఉంటారని భావించవచ్చు . అయితే పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ , కుమారుడు , కోడలు నేరుగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం ను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది .

    సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎండ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి తన భర్త ఆచూకీ కోసం తాము పడుతున్న బాధను సీఎంకు తెలియ జేయాలని కోరినట్లు సమాచారం. వారం క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన విష యాన్ని సాక్షాత్తూ టీఆర్ఎస్ నేతలే ధ్రువీకరిస్తు న్నారు . అడ్వకేట్ వామరావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం , అదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో ఆయన మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని సమాచారం. హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిన మధు, తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మంథనిలోనే వదిలి, ఆయన భార్య శైలజ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. మధు వాహనం ప్రస్తుతం ఆయన మామ ఇంట్లో పార్కింగ్ చేసి ఉంది. మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ' వని ' పట్టణంలో పుట్ట మధు సోదరుడు , మరో బంధువు ఇంట్లో అక్కడి జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ జరిపినట్లు ఆ రాష్ట్రంలోని ఓ పత్రికలో కథనం ప్రచు రితమైంది. కాగా .. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను ఆసిఫాబాద్లోని వాంకిడి వద్ద పట్టుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో మధు మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు స్పష్టమవుతోంది . అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారం ఉంది. కానీ .. పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో టచ్లో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చిన మధు టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వామన్ రావు హత్య కేసుతో పాటు ఈటల వ్యవహారంలో తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్‌కు చెప్పించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇద్దరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గురువారం మధు భార్య శైలజ , ఆమె కుమారుడు , కోడలితో కలిసి హైదరాబాద్లో మంత్రి కొప్పుల వద్దకు వెళ్లగా .. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన సూచన మేరకు వెనుదిరిగినట్లు సమాచారం. అదే క్రమంలో ఆర్ఆండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ ను కలిసి తన భర్త మధు ఆచూకీ ఐదు రోజులుగా దొరకడం లేదని .. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరారు . కేసీఆర్ వెంటే మేమూ .. మా నాయ కుడు పుట్ట మధు ' అని మంథని నియోజకవర్గం లోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు , నాయకులు విలేకరుల సమావేశంలో అన్నారు. మంథనిలో చీలికకు కొందరు కుట్ర చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Karimnagar, Manthani, Missing person, Peddapalli, Putta madhu, Trs, Vaman rao, Zp chairperon

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు