హోమ్ /వార్తలు /తెలంగాణ /

తనకు పెళ్లి కావడం లేదని.. మేనమామను కొట్టి చంపిన యువకుడు

తనకు పెళ్లి కావడం లేదని.. మేనమామను కొట్టి చంపిన యువకుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వేస్టేషన్ నుంచి కొంతదూరం తీసుకెళ్లి... నిర్మానుష్య ప్రాంతంలో... రాయమల్లు తల, ఇతర శరీర భాగాలపై మరోసారి కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రాయమల్లు అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌ పక్కన పడేసి వెళ్లిపోయాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

ఆ యువకుడికి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఒక్కటి కూడా కుదురడం లేదు. తనకు పెళ్లి కాకపోవడానికి తన మేనమామే కారణమని..ఆయన భిక్షాటన చేయడం వల్లే ఇలా జరుగుతోందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మేనమామను చంపేందుకు ప్లాన్ చేసుకున్నాడు. పక్కా పథకం ప్రకారం.. అతడి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. రైల్వే పట్టాలపై పడేశాడు. పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఈ దారుణం జరిగింది.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన చిప్పగుర్తి శివ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి మేనమామ మారుపాక రాయమల్లు(50) భిక్షాటన చేసేవాడు. ఐతే కొంత కాలంగా శివకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఏదీ కుదరకపోవడంతో... తన మేనమామ భిక్షాటన చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని శివ భావించాడు. ఈ క్రమంలోనే రాయమల్లుపై కోపం పెంచుకున్నాడు. తన మేనమామ చనిపోతేనే తన పెళ్లి జరుగుతుందని...అతడిని చంపాలని పక్కాగా పథకం పన్నాడు. ప్లాన్ ప్రకారం.. ఈ నెల 3న సెంటినరీకాలనీలోనే రాయమల్లుపై దాడి చేసి ఆటోలో పెద్దపల్లికి తీసుకొచ్చాడు. రైల్వేస్టేషన్ నుంచి కొంతదూరం తీసుకెళ్లి... నిర్మానుష్య ప్రాంతంలో... రాయమల్లు తల, ఇతర శరీర భాగాలపై మరోసారి కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రాయమల్లు అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌ పక్కన పడేసి వెళ్లిపోయాడు.

పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ నెల 4న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపివచడంతో... పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా... ప్రమాదవశాత్తు పడినా.. మృతదేహం ట్రాక్‌కు కొద్ది దూరంలో పడుతుంది. కానీ ట్రాక్‌కు చాలా దూరంలో మృతదేహం పడడంతో... పోలీసులకు అనుమానం వచ్చింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఓ ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. సెంటినరీకాలనీలోని సీసీ ఫుటేజీలోనూ అదే ఆటోను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆ ఆటో కోసం పోలీసులు గాలించారు. మంగళవారం పెద్దపల్లి బస్టాండ్‌ సమీపంలో ఎస్సై రాజేశ్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటో కనిపించింది. పోలీసులను చూసిన వెంటనే డ్రైవర్‌ టెన్షన్ పడడంతో పాటు అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు నిజం తెలిసింది. తన మేనమామకు తానే చంపేసినట్లు శివ అంగీకరించాడు.

First published:

Tags: Crime news, Local News, Telangana

ఉత్తమ కథలు