E.Santosh, News18, Peddapalli
సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) లో మొక్కలు, జంతువులు, నేల, నీరు, సూక్ష్మజీవులతో మొత్తం వ్యవస్థను రక్షించవచ్చు. అరటిపండ్లను సేంద్రీయంగా పెంచడం, సహజ పదార్ధాలను ఉపయోగించి మొక్కను పోషించడం అనేది రసాయన పురుగుమందులు లేకుండా తినదగిన అరటిని ఉత్పత్తి చేయడం. నేల భౌతిక, రసాయన లక్షణాలను మెరుగుపరచడంతో పాటు, సేంద్రీయ పదార్థం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు, ఎంజైమ్ల నిర్మాణం కారణంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆర్గానిక్స్ ద్వారా పోషక నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పద్దతుల్లో వరి, అరటి ఇలా ఏ పంటైనా సాగు చేయవచ్చు. ఇలానే ప్రకృతి వ్యవసాయం చేస్తూ మైథిలి అనే యువతి పలువురికి అర్ధర్శంగా నిలుస్తుంది.
పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ముత్తారం మండలం హరిపూరం గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, పుష్పాలత దంపతుల కుమార్తె మైథిలి డిగ్రీ వరకు చదువుకుని వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఇటు వైపు అడుగులు వేసింది. గతంలో ఎరువులతో కూడిన వ్యవసాయం చేయడం ద్వారా జరుగుతున్న నష్టాలను తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలని సుభాష్ పాలేకర్ (Subhas Palekar) వద్ద పంట సాగు విధానం నేర్చుకుని దేశి విత్తనాలతో సాగు చేయడం ప్రారంభించింది. ఏ రకమైన పంట సాగు చేసినా అది దేశి విత్తనాలతో మాత్రమే చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల వరి పంట సాగు చేసిన మైథిలి ఇప్పుడు దేశి సాగులో అరటి తోట సాగుపై దృష్టి సారించింది. కేరళ నుండి ఏడు రకాల దేశి అరటి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేస్తుంది.
అరటిలో రకాలు లాభాలు..!
దేశిఅరటి సాగులో మైథిలి 7 రకాల పంట సాగు చేస్తుంది. అవి చెంగదలి, చుందిల్లకందన్, పువ్వెన్, న్యాలి పువ్వేన్, పువ్వెం కొడెన్, నేంద్ర పాలెన్, రోబెస్క అను దేశి విత్తనాలను ఒక్కో రకం వంద నుండి 700 వందల మొక్కలను నాటి సాగు చేస్తున్నారు. అవి కోతకు వచ్చి ఇప్పుడు అమ్మకం కూడా మొదలైంది. అయితే హైబ్రిడ్ పంటలో వచ్చిన అరటికి దేశి విత్తన పంటకు ఎన్నో లాభాలు ఉన్నాయి.
మనకి సాధారణంగా మార్కెట్లో దొరికే అరటి రసాయనాలు, మందులతో పెరిగే పంట నుండి వస్తాయి. దాంట్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. దేశి రకంతో ఎటువంటి మందులు వాడకుండా కేవలం ప్రకృతితో ముడి పడి చేసే సాగు కాబట్టి ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు వుంటాయి.. ఎంతో రుచికరంగా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భుమి ఆరోగ్యంగా ఉంటుందని ఫార్మర్ మైథిలి తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Organic Farming, Peddapalli, Telangana