హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: నేటి యువకులకు వీరే ఆదర్శం.., వీళ్ల సేవకు సెల్యూట్ చేయాల్సిందే..!

Peddapalli: నేటి యువకులకు వీరే ఆదర్శం.., వీళ్ల సేవకు సెల్యూట్ చేయాల్సిందే..!

X
గోదావరి

గోదావరి ఖనిలో సమాజ సేవ చేస్తున్న యువకుడు

Peddapalli: మానవ సేవయే మాధవ సేవ.. మానవులకు సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేయడమేనని అర్థం. ఇది అక్షరాలా నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ విషయం తెలియక కేవలం భగవంతుడి సేవ చేసేవాళ్ళు కొందరైతే, అటు ఇంకొందరు దేవుడితో పాటు మానవునికి కూడా సేవ చేస్తారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle | Telangana

E.Santosh, News18, Peddapalli

మానవ సేవయే మాధవ సేవ.. మానవులకు సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేయడమేనని అర్థం. ఇది అక్షరాలా నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ విషయం తెలియక కేవలం భగవంతుడి సేవ చేసేవాళ్ళు కొందరైతే, అటు ఇంకొందరు దేవుడితో పాటు మానవునికి కూడా సేవ చేస్తారు. దేవుడు గుడిలో లేడు.. పేదవారిలోనే ఉన్నాడని కొందరు మానవ సేవే పరమావధిగా ముందుకు పోతారు. గొప్పలకు పోకుండా, ఏమీ ఆశించకుండా చేసే సేవతో పొందే ఆనందం, తృప్తి ముందు ఏదైనా చిన్నదేనని అనుకుంటారు. అలా సేవ వైపు అడుగులు వేస్తూ అతి చిన్న వయసులోనే సేవ కార్యక్రమాలను చేపడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు గోదావరిఖనికిచెందిన ఓ యువకుడు.

పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనికి చెందిన అర్ష అనే వ్యక్తి అతి చిన్న వయసులో పెద్ద మనసు చేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మదర్ థెరిస్సా స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలను మొదలు పెట్టాడు. గత నాలుగేళ్లుగా సేవా కార్యక్రమాలను మొదలు పెట్టిన ఆర్ష తన 20 ఏళ్ల వయసులోనే తొలిసారి ఇటువైపు అడుగులేశానని చెప్పాడు. 4 ఏళ్లుగా ఎవరిపై ఆధార పడకుండా తన సొంత డబ్బులతో సేవ చేస్తున్నట్లు చెప్పాడు. కొద్ది రోజుల కిందటే ఆర్ష పేరిట ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించిన ఆర్ష ఇప్పుడు చేసే అన్ని కార్యక్రమాలు ఫౌండేషన్ పేరుతోనే చేస్తున్నాడు.

ఇది చదవండి: సీరియల్ చూస్తుంటే డిస్టబ్ చేశాడని రక్తమొచ్చేలా..!

ఆర్ష మనసులో ఎన్నో ఆలోచనలు..!

సేవ చేయడంలో మనసుకు ప్రశాంతత, నిర్మలత్వం లభిస్తుంది. అన్నింటికీ మించిన సంతృప్తి లభిస్తుంది. ఈ జీవితానికి ఇలాంటి ఆనందం, తృప్తి చాలు అనిపిస్తుందని ఆర్ష చెప్తున్నాడు. సేవ చేయడంలో, ఆ సేవను పొందడంలో చిన్న-పెద్ద, పేద-ధనిక అనే భేదం లేదంటున్న అర్ష.. ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలా సహాయ పడతారో, ఎవరికి ఎప్పుడు ఏ సహాయం అవసరం అవుతుందో ఎవరికీ తెలియని విషయమని చెప్తున్నాడు. అందుకే సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు గాని, అవసరాల్లో ఉన్నప్పుడు గాని, ఆ సమయంలో ఆ మనిషికి తోచినంత సహాయం చేస్తున్నాను అని తెలిపాడు.

అర్ష సేవకు అండగా స్నేహితులు..!

అర్ష సేవను ఆదర్శంగా తీసుకొని తన స్నేహితులు అండగా నిలుస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా వారు ముందుండి నడిపిస్తున్నారు. వారిలో ఎవరి పుట్టిన రోజులైనా ఎంటర్మైనట్ పార్టీలకు దూరంగా ఉంటూ వాటికి ఖర్చు చేసే మొత్తాన్ని సేవ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా యువకులు వీరి సేవలను ఆదర్శంగా తీసుకొని సేవ కార్యక్రమాల్లో ముందుకు రావాలన్నది తమ ఆలోచనగా భావిస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు