E.Santosh, News18, Peddapalli
ఈ పెన్సిల్స్ అన్నీ చూస్తే చెక్కి పడేసిన వాటిలా కనిపిస్తున్నాయని అనుకుంటే పొరపాటే, ఆ పెన్సిల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అవి చూస్తే మీరు ఆశ్చర్య పోవాల్సిందే. నిజంగా మనిషిగా పుట్టిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో ట్యాలెంట్ ఉంటుంది. కానీ ఇలాంటి ట్యాలెంట్ మాత్రం చాలా అరుదు. మామూలు బొమ్మలు గీస్తేనే రూపం రాదు.. అలాంటిది పెన్సిల్ లిడ్ పై ఎలాంటి బోమ్మనైనా అలోవకగా వేస్తూ అబ్బుర పరుస్తున్నాడు పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గంగానగర్ కు చెందిన మహేందర్. మైక్రో ఆర్ట్స్ టాలెంట్తో అదుర్స్ అనిపిస్తున్నాడు. ఆయనకిగురువు కూడా ఎవరూ లేరు. పట్టుదలతో పట్టు పట్టి ఈ కళను నేర్చుకొనిపెన్సిల్ లిడ్ పై ఎన్నో చిత్రాలను చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు.
1 సెం.మీ ఎత్తు, 3 మిమీ వెడల్పుతో కొద్ది నిమిషాలసమయంలోనే పెన్సిల్ పైఎన్నో అద్భుతమైన బొమ్మలను చక్కగా చేశాడు. మహేందర్ చదివింది తక్కువే అయినప్పటికీ ఆయనకు ఉన్నట్యాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వృత్తి రీత్యా మహేందర్ ఒక శిల్పి కాగా సిమెంట్ విగ్రహాలు తయారు చేస్తాడు. విగ్రహాల తయారీతోనే జీవనం సాగిస్తాడు. మహేందర్ కి చిన్ననాటి నుండే సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్నారు. పెన్సిల్, ఆకులు, చాక్ పీస్, ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుపై తన టాలెంట్ తో రకరకాల బొమ్మలు వేస్తున్నాడు. ఇప్పటికే చాలా రకాల బొమ్మలు పెన్సిల్ పై వేశాడు.
పెన్సిల్ లిడ్ పై తన ప్రతిభతో వేసిన బొమ్మలు ఇవే..!
కెసిఆర్ నిలుచున్న బొమ్మ, హనుమాన్ నిలుచున్న బొమ్మ, జై తెలంగాణ , కారు బొమ్మ, తెలంగాణ అమరవీరుల స్థూపం, సాయి బాబా విగ్రహం, లవ్ హార్ట్, ఇలా అనేక రకాల బొమ్మలు పెన్సిల్ లీడ్ పై చెక్కాడు. ఇలా మహేందర్ ఇప్పటివరకు చేసిన బొమ్మలు అన్ని కూడా అద్భుతాలే. మహేందర్ విభిన్నమైన మైక్రో ఆర్ట్స్‌తో తయారు చేస్తున్న ఆర్ట్స్ చూపురులనుఇట్టే కట్టి పడేస్తున్నాయి.
చిన్ననాటి ఆటలే నేడు ఆవిష్కరణలు..!
మహేందర్ చిన్న వయసులో చాక్ పిస్ పై బొమ్మలు గీస్తూ ఆట ఆడుకునే వాడు. అలా ఆడిన ఆటే సాధనగా మారింది. తరువాత పెన్సిల్ పైకి మళ్లింది. అనేక ప్రయత్నాల తరువాత ఇప్పుడు అద్భుతంగా పెన్సిల్ లీడ్ పై బొమ్మలు వేస్తున్నాడు మహేందర్.
గుర్తింపు కోసం ఆరాటం..
ఇప్పటి వరకు పెన్సిల్ లీడ్ పై ఎన్నో బొమ్మలను చెక్కిన మహేందర్ కళకు గుర్తింపు కావాలని కోరుతున్నారు. పెన్సిల్ లిడ్ పై ఎలాంటి బోమ్మనైనా అలవోకగా గీయగలనని అంటున్న మహేందర్.. ట్యాలెంట్ ని గుర్తుంచి ఆదరిస్తే చాలంటున్నాడు. ఈ మైక్రో ఆర్ట్ నేర్చుకోవాలనుకొనే వారికి కూడా నేర్పిస్తాను అంటున్నాడు మహేందర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana