హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: నీటిపై యోగా.. 75 ఏళ్ల వయసులో నీటిపై ఆసనాలు

Peddapalli: నీటిపై యోగా.. 75 ఏళ్ల వయసులో నీటిపై ఆసనాలు

X
నీటిపై

నీటిపై యోగా

Telangana: సినిమాలోనీటిపై పడుకోవడం, నీళ్ళ లోపల యోగ చేయడం వంటి సన్నివేశాలు చూసే ఉంటారు. అందులో కొన్ని గ్రాఫిక్స్ లో చిత్రీకరించి చూపిస్తారు. కానీ ఇదిగో చూడండి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోనీటి మీద చిత్ర విచిత్రమైన ప్రయోగాలు, ఆసనాలు సునాయాసంగా చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : పెద్దపల్లి

సినిమాలోనీటిపై పడుకోవడం, నీళ్ళ లోపల యోగ చేయడం వంటి సన్నివేశాలు చూసే ఉంటారు. అందులో కొన్ని గ్రాఫిక్స్ లో చిత్రీకరించి చూపిస్తారు. కానీ ఇదిగో చూడండి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోనీటి మీద చిత్ర విచిత్రమైన ప్రయోగాలు, ఆసనాలు సునాయాసంగా చేస్తున్నారు.

నీటిపై యోగా...

ప్రతి రోజూ యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు అనే విషయాలు మనం వింటూనే ఉంటాం. కానీ నీటిపై యోగా అనేది మాత్రం మనకు పెద్దగా వినిపించని, కనిపించని దృశ్యం. ఎందుకు అంటే యోగా అంటే సాధారణంగా నేలపై చేసే వ్యాయామం. కాబట్టి అందరూ అలాగే చేస్తారు. నీటిపై యోగా అంటే కొంచం ఆశ్చర్యం కలిగించే దృశ్యం అయినప్పటికీ.. ఈయన మాత్రం ఎంతో సులువుగా నీటిపై యోగ ఆసనాలుచేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా 75 ఏళ్ల వయసులో కూడా నీటిపై సునాయాసంగాయోగా చేస్తున్నారు.

వీడియోలో కనిపిస్తున్న వీరంతా సింగరేణి విశ్రాంత కార్మికులు కాగా వీరు శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు గాంధీ నగర్ సింగరేణి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేవారు. కొన్ని రోజులకుఅలా నీటిపైయోగ ఆలోచన చేసి స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి సారథ్యంలో వీరంతా కేవలం ఒక్క నెలలోనే నీటిపై యోగా నేర్చుకుని ప్రతి రోజూ ఈ నీటిపై యోగ చేస్తూ తమ ఆరోగ్యాన్ని ఉత్తేజంగా ఉత్సాహంగా ఉంచుతున్నామని అంటున్నారు.

నీటిపై యోగా వల్ల ప్రయోజనాలు..

నీటిలో యోగా ఆసనాలను అభ్యసించడం వల్ల మీ శరీరం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. ఎలాంటి ఆసనాలు అయినా చేయవచ్చు. ఇది మీ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. స్థిరత్వం ఏకాగ్రతను ప్రోత్సహిస్తుంది.మీ శరీరాన్ని మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి ధ్యానంతో తేలియాడే శవాసనాం.. పద్మ ఆసనం వంటివి ప్రయత్నించవచ్చు.

నీటిపై యోగా చేయడానికి వయసుతో సంబంధం లేదు.. ఏ వయసు వారైనా చేయొచ్చు..ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా మెంటల్ టెన్షన్ కు లోనయి హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాల నుండి యువతకు అయినా పెద్దలకు అయినా ఉపశమనం పొందడానికి ఇలాంటి వ్యాయామాలు ఉపయోగ పడతాయని కోచ్ కృష్ణ మూర్తి అంటున్నారు.

నీటి యోగా సాధన చేస్తున్నప్పుడు ధరించవలసినవి..

మీరు తేలికైన, సాగదీయగలిగే సౌకర్యవంతమైన దుస్తులను ధరించడం ద్వారా నీటిపై యోగా చేయవచ్చు. బాత్ సూట్‌లు, వెట్‌సూట్‌లు ధరించవచ్చు.స్విమ్ క్యాప్‌తో పాటు టాప్‌తో కూడిన షార్ట్‌లను కూడా ధరించవచ్చు. మీరు దీన్ని అవుట్‌డోర్ పూల్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే.. టోపీ, సన్ గ్లాసెస్ వంటి ఇతర యూవీ రక్షణతో పాటు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ను ధరించి చేయాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతాలలో ఎవరికైనా నీటి పైనే యోగా చేయాలని.. ఉత్సాహం ఉన్నవారు గాంధీ నగర్ లోని సింగరేణి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి సంప్రదించవచ్చు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు