హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapelli: పనికిరాని వస్తువులే ఒక ఆహ్లాదం.. ఆకర్షణీయం

Peddapelli: పనికిరాని వస్తువులే ఒక ఆహ్లాదం.. ఆకర్షణీయం

X
పూల

పూల చెట్లతో అందంగా అలకరించిన ఇల్లు

Peddapalli: ఇల్లే ఒక నందన వనం, పనికి రాని వస్తువులే ఒక ఆహ్లాదం. ఆరోగ్యంగా ఉండాలంటే నడక.. విశ్రాంతి.. పోషకాహారం కావాలి. కానీ వీటికి తోడు ప్రకృతితో సహవాసం కూడా ఉండాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

santosh, News18, Peddapalli

ఇల్లే ఒక నందన వనం, పనికి రాని వస్తువులే ఒక ఆహ్లాదం. ఆరోగ్యంగా ఉండాలంటే నడక.. విశ్రాంతి.. పోషకాహారం కావాలి. కానీ వీటికి తోడు ప్రకృతితో సహవాసం కూడా ఉండాలి.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందినప్రకృతి ప్రేమికురాలు నీత రెడ్డి.. తన ఇంట్లో వివిధ రకాల పూలు, మెడిసిన్ మొక్కలు పెంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడుపుతున్నారు. నేత రెడ్డికిపూల మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ అందుకే అలాతన సొంతింటి నందన వనంలా మార్చేశారు. నేతా రెడ్డి ఇంటి భాగంలో ఎక్కడ చూసినా పచ్చదనంతో పాటు అందమైన పూలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.

ఆ ఇంటిపై వంద రకాల మొక్కలున్నాయి. ఇందులో కొన్ని మెడిసిన్ సంబధించిన చెట్లు కూడా ఉన్నాయి. పనికి రాని వస్తువులే ఇక్కడ పూల తొట్టిలు, నేత రెడ్డి ఇంట్లో పూల చెట్లు అన్ని కూడా ఇంట్లో వాడి పడేసిన వస్తువులే. పర్యావరణం పై ఉన్న మక్కువ ఆమె పనికి రాని వస్తువులను పడేయకుండా వాటిని అందంగా పెయింటింగ్ చేసి పూల తొట్టిలుగా మార్చేస్తారు. అందులో మందు బాటిల్స్, ఆయిల్ కేన్స్, షాంపూ బాటిల్స్, ఫినాయిల్ బాటిల్స్, ఇలా ఎదైన కావచ్చు.. వాటిని పూల తొట్టిలాగా మర్చేస్తు దాంట్లో చెట్లకు జీవం పోస్తుంది.

ప్రకృతి ఒడిలో నేత రెడ్డి ఇల్లు...

ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి.. ఇంట్లోని పనికి రాని చెత్త కూడా అవసరమే... ఇంట్లోని పనికి రాని చెత్త కూడా ఉపయోగ పడుతుంది అని తెలియజేస్తున్నారు నీతా రెడ్డి. మిగిలిన అన్నం, కోసిన కూరగాయల వేస్టేజి అయినా ఎది కూడా పడేయకుండా ప్రతిది ఉపయోగిస్తూ ప్రకృతిని పచ్చదనంలో తనకు తానే సాటి అని నిరూపించింది. వంట రూమ్ నుండి బయట చెత్త పడేయకుండా మూడు కుండలు ఏర్పాటు చేసి అందులో వెస్తేజిని సుమారు నలభై రోజుల పాటు స్టోర్ చేసి ఆ పదార్థాలు అన్ని కుళ్ళిన తరువాత చెట్లకు ఒక ఎరువుగా ఉపయోగిస్తుంది.

అలా ఉపయోగించడం వల్ల చెట్లకు బలం. ప్రకృతికి ఆహ్లాదం లభిస్తాయని తెలిపింది నీతా రెడ్డి. ఇల్లు ఒక ప్రకృతి ఒడిలో ఒదిగిన నందన వనంలా కనిపిస్తుంది. ఇల్లంతా చెట్లతో పరిమళిస్తుంది. ఇంట్లోని హాల్, రూమ్స్ లో కూడా నీరు శాతం అవసరం లేని మొక్కలు ఉన్నాయి. ఇంట్లోని గోడలపై తన చేతి వేసిన వినాయకుడి పెయింటింగ్, పిట్టలు ఇల్లు తయారుచేసి గడ్డితో వినాయకుడు ఆకర్షణీయంగా ఉన్నాయి. పూర్వం ఉండే ట్రంకు పెట్టలు సైతం అందమైన పరికరంలా మారాయి. ఎది ఏమైనా ఇలా అందరూ పనికి రాని వస్తువులను పడేయకుండా వాటిని ఉపయోగించి ఒక చెట్టు నాటితే ప్రతి ఇల్లు ఒక అందమైన నందన వనంలా మారి ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు