Home /News /telangana /

PEDDAPALLI WITH 500 METERS TRICOLOR FLAG PEOPLE PARTICIPATED IN FREEDOM RUN IN PEDDAPALLI PSE ABH BRV

Peddapalli: 500 మీటర్ల జాతీయ పతాకంతో, 'భారత్ మాతాకీ జై' నినాదాలతో వెల్లివిరిసిన దేశభక్తి

గోదావరిఖనిలో 500 మీటర్ల జాతీయ పతాకంతో దేశ భక్తినీ చాటుకున్నారు

గోదావరిఖనిలో 500 మీటర్ల జాతీయ పతాకంతో దేశ భక్తినీ చాటుకున్నారు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఆగష్టు 8 నుండి 22వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E.Santosh,  News 18, Peddapalli)

    దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఆగష్టు 8 నుండి 22వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించనుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రజలు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావిఖనిలో రెండు రోజులు పాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.



    వాడవాడన వెల్లివిరిసిన దేశ భక్తి:
    పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని పట్టణ వీధుల్లో ఆవిష్కరించారు. పట్టణ ప్రజలు ఉత్సాహంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని దేశ భక్తి చాటుకున్నారు. మువ్వన్నెల జెండాను చేతబూని 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ర్యాలీ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని లక్ష్మీ నగర్లోని రీగల్ షూ మార్ట్ సమీపం నుండి కళ్యాణ్ నగర్ వరకు వీధి పొడవునా ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా 12 రాష్ట్రాలకు సిరిసిల్లలోని చేనేత కార్మికులతో త్రివర్ణ పతాకాలను తయారు చేయించి ఎగుమతి చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఉచితంగా అందజేయడంలో దేశభక్తి, మన పతాకాలను మన రాష్ట్రంలోనే తయారు చేయించడం ద్వారా చేనేత కార్మికులకు చేతినిండా పనితో పాటు దేశభక్తి భావం పెరిగిందని పద్మశాలి సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

    పెద్దపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్:
    'దేశభక్తిని గుండెల్లో నింపుకుందాం జాతీయ సమైక్యతను చాటుదాం' అని పెద్దపల్లి పట్టణ పోలీసులు పిలుపునిచ్చారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ముఖ్య అతిధులుగా హాజరై ఫ్రీడం రన్ ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు ఫణంగా పెట్టారని, దేశ స్వేచ్ఛ కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ, స్వతంత్ర ఉద్యమాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఈ ఫ్రీడమ్ రన్ దేశభక్తిని చాటి చెప్పడానికి, దేశ సమైక్యతను దశదిశల వ్యాపింప చేయడానికి, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తించుకొనడానికి ఉద్దేశించబడినదని అన్నారు.

    Read This; Peddapalli: అల్లుడి తండ్రిని హతమార్చి, ఆపై దొంగల పనిగా చిత్రీకరించి: పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!!
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Azadi Ka Amrit Mahotsav, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు