హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఏంటి తల్లి.. అందరినీ ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతావా?

Peddapalli: ఏంటి తల్లి.. అందరినీ ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతావా?

భార్యాభర్తలు (ఫైల్​)

భార్యాభర్తలు (ఫైల్​)

ఏడేళ్ల దాంపత్యంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవల భార్య ప్రవర్తనలో కొంత మార్పు గమనించిన అతను వ్యవహారం మార్చుకోమన్నాడు. ఇదే విషయం ఆ ఇద్దరి మధ్య చిచ్చు రేపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(E. Santosh, News18, Peddapalli)

ప్రేమ (Love) పేరుతో దగ్గరై పెళ్లితో బంధం ముడిపెట్టుకున్నా వివాహం అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ ప్రేమ బంధానికి అర్థం లేకుండా చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అత్యధికంగా ఇలాంటి కేసులు జరుగుతున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూస్తూ.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖని గంగానగర్లో ఆగష్టు నెలలో భార్య ప్రియుడితో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపించిన ఘటన మరవకముందే భార్య చేతిలో భర్త హతం (Wife killed husband) అనే వార్త వెలుగులోకి వచ్చింది.

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. మతాలు (Religions) వేరైనా పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్ల దాంపత్యంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవల భార్య ప్రవర్తనలో కొంత మార్పు గమనించిన అతను వ్యవహారం మార్చుకోమన్నాడు. ఇదే విషయం ఆ ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య గొంతు నులిమి హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (NTPC) ఆటోనగర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ఆటోనగర్లో నివసిస్తున్న ఎండి. అజీంఖాన్(33) అదే కాలనీకి చెందిన శ్రావణిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజీంఖాన్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వారు, అత్త నర్మద (శ్రావణి తల్లి) ఇంట్లోనే నివసిస్తున్నారు. కుమారులు హమాన్(5), హర్మాన్ (7)లను పాఠశాలలకు పంపించి శ్రావణి ప్రతిరోజు కృష్ణానగర్లోని ఓకార్పొరేట్ వ్యాపార సంస్థలో పనికివెళ్తుంది.

ఇటీవల శ్రావణి తరచూ ఫోన్లో మాట్లాడుతూ దుకాణానికి వెళ్తుండటాన్ని గమనించిన అజీంఖాన్, భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పదేపదే గొడవ పడ్డాడు. ఈ విషయమై మంగళవారం సాయంత్రం భార్య, అత్త నర్మద అజీమ్ తో గొడవకు దిగారు. ఈ క్రమంలో శ్రావణి, నర్మదలు ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లారు. భర్త గొంతును శ్రావణి గట్టిగా నులిమేయడంతో కిందపడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు దృవీకరించారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, ఎస్సై జీవన్... ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని సోదరుడు నదీమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై బి. జీవన్ తెలిపారు.

First published:

Tags: Crime news, Local News, Peddapalli, Wife kill husband

ఉత్తమ కథలు