E. Santosh, News18, Peddapalli
ఈ రోజుల్లో తాళికట్టిన బంధానికంటే.. తాత్కాలిక సుఖాల వెంట పరుగులు పెట్టేవాటికే కొందరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వాటి కోసం ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న భర్తను.. ప్రియుడి మోజులో పడి భార్యే దారుణంగా హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే.. రామగుండంలో 'భార్య చేతిలో భర్త హతం' ఘటనలో ట్విస్ట్. రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో... క్షణికావేశంలో భార్య శ్రావణి చేతిలో భర్త అజింఖాన్ హతమైనట్లు మొదట అంతా భావించారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసీ స్థానికులు ఖంగుతిన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నడనే శ్రావణి తన భర్త అజింఖాన్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న అజింఖాన్ను అంతమొందించేందుకు గతంలోనే పలుమార్లు హత్యా ప్రయత్నం కూడా చేసిందట శ్రావణి. అవన్నీ కుదరకపోవడంతో తన తల్లితో కలిసి శ్రావణి... అజింఖాన్ గొంతు నులిమి, బ్యాట్‌తో కొట్టి చంపినట్టు నిందితురాలు తా విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్టీపీసీ ఆటోనగర్‌లో నివసిస్తున్న ఎండి. అజీంఖాన్(33) అదే కాలనీకి చెందిన శ్రావణిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజీంఖాన్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వారు, అత్త నర్మద (శ్రావణి తల్లి) ఇంట్లోనే నివసిస్తున్నారు. కుమారులు హమాన్(5), హర్మాన్ (7)లను పాఠశాలలకు పంపించి శ్రావణి ప్రతిరోజు కృష్ణానగర్‌లోని ఓకార్పొరేట్ వ్యాపార సంస్థలో పనికివెళ్తుంది.
ఇటీవల శ్రావణి తరచూ ఫోన్లో మాట్లాడుతూ దుకాణానికి వెళ్తుండటాన్ని గమనించిన అజీంఖాన్, భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పదేపదే గొడవ పడ్డాడు. ఈ విషయమై మంగళవారం సాయంత్రం భార్య, అత్త నర్మద అజీమ్ తో గొడవకు దిగారు. ఈ క్రమంలో శ్రావణి, నర్మదలు ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లారు. భర్త గొంతును శ్రావణి గట్టిగా నులిమేయడంతో పాటు బ్యాట్ తో కొట్టి హతమార్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇచ్చిన అప్పు డబ్బులు తిరిగి ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
వరుసకు అన్నయ్య అని అప్పుఇచ్చాడు. ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదని మనస్తాపం చెందాడు. చివరికి అతని ఇంటికే వెళ్లి, ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఉపేందర్‌రావు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామానికి చెందిన తాడుపునూరి వరప్రసాద్ (40) ఓ చిట్ ఫండ్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన తన సమీప బంధువు, వరుసకు అన్నయ్య అయిన రమేష్‌కు మూడేళ్ల క్రితం రూ.4 లక్షలను అప్పుగా ఇచ్చాడు. ఇతర వ్యక్తుల వద్ద నుంచి తీసుకొని ఆ డబ్బు ఇచ్చాడు వరప్రసాద్. కానీ రమేశ్ అప్పు చెల్లించడంలో జాప్యం చేశాడు. ఈ క్రమంలో వరప్రసాద్‌కు డబ్బిచ్చిన వ్యక్తులు అతనిపై ఒత్తిడి చేయడంతో మంగళవారం సాయంత్రం సుల్తానాబాద్ వెళ్లాడు. రమేష్ ఇంట్లో లేకపోవడంతో డబ్బులు ఇవ్వడేమోనని మనస్తాపం చెంది, వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana