హోమ్ /వార్తలు /తెలంగాణ /

మీ కుక్కలు మీతో మాట్లాడాలా?..అయితే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించండి..

మీ కుక్కలు మీతో మాట్లాడాలా?..అయితే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించండి..

dogs train

dogs train

కుక్కలకు మనుషులు మాట్లాడితే ఎలా అర్థం అవుతాయో ఇక్కడే ట్రైనింగ్..పూర్తి వివరాలివే..

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లక్ష్మీపురంలో ఒక మాజీ సైనికుడు కుక్కలకు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నాడు. మనుషులు మాట్లాడితే కుక్కలు ఎలా అర్థం చేసుకోవాలి. అపరిచితుల పట్ల ఎలా ప్రవర్తించాలి. వాల్ జుంపింగ్, రింగు జంపింగ్, ఎక్సర్సైజ్ వంటి పలు రకాల ట్రైనింగ్ చేస్తున్నాడు. బండారి రమేష్ గోదావరిఖనికి చెందిన వాసి కాగా.. ఇండియన్ ఆర్మీ వెటర్నరీ కార్ప్స్ అండ్ కాలేజీలో ఆర్మీ డాగ్ ట్రైనర్ గా 18 సంవత్సరాలు విధులు నిర్వహించి 2019లో రిటైర్డ్ అయ్యారు. రామగుండంలోని ఎలుకలపల్లి దగ్గర ఒక షెడ్డును నిర్మించుకుని సైనిక్ పెట్ పాస్ పేరుతో కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

బొడ్రాయి అంటే ఏమిటి? దానిని ఊరి మధ్యలోనే ఎందుకు ప్రతిష్టిస్తారు..చరిత్ర ఏంటి?

మీ కుక్క మాట్లాడగలిగితే మీరు సంతోస్తారు కదా..కానీ అవి మాట్లాడలేవు. దానికి బదులుగా అవి ఎలా చెప్పాలో అర్ధం కాక చెడుగా ప్రవర్తించడం, ఫర్నిచర్ నమలడం లాంటివి చేస్తూ మీకు చికాకు కలిగించేలా చేస్తారు. అయితే ఇది నిరోధించడానికి కుక్కలకు వారి మెదడును ఉత్తేజపరచడం అవసరం. మీ కుక్కను ప్రశాంతంగా ఉంచడంలో ముఖ్యమైన అంశాలలో ఒకటి వాటి మనస్సులను నిమగ్నమై ఉంచడం అని రమేష్ అంటారు. చిన్న పిల్లల మాదిరి కుక్కపిల్లల మనస్సును ఉత్తేజపరిచేందుకు అనువైన వివిధ రకాల ఆటలను ఆడించాలని రమేష్ అంటున్నారు.

పోలీస్ స్టేషన్ నుండే బైక్ తో పరారైన యువకుడు..వెంబడించిన కానిస్టేబుల్..చివరకు ఏం జరిగిందంటే?

ఇది కుక్కలను చాలా అవసరం..

పజిల్స్ మీ పెంపుడు జంతువును నిమగ్నం చేయడానికి ఒక అద్భుతమైన పద్ధతి పజిల్స్ మీ కుక్క మెదడును అద్భుతంగా ఉంచుతాయి. సంతృప్తి పరచడానికి మార్గాన్ని అందిస్తాయి. మార్కెట్లో అనేక పజిల్ బొమ్మలు ఉన్నాయి. మీరు మీ కుక్క ప్రాధాన్యతలకు సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు.

మీ కుక్కకు కొత్త ట్రిక్స్ ఇవే..

పాత కుక్కకు కొత్త ట్రిక్స్ నేర్చుకునేలా చేయకూడదని ఒక సామెత ఉంది. అయితే ఇది ఎల్లప్పుడూ అలా ఉండదని రమేష్ అంటారు. కొంచెం ఓపిక, కొంత సృజనాత్మకతతో మీరు మీ కుక్క మెదడును చురుకుగా ఉంచడంలో కొత్త ఉపాయాలు నేర్పించవచ్చని రమేష్ అన్నారు.

సైనిక్ లో లభించేవి ఇవే..

బండారి రమేష్ వద్ద ట్రైనింగ్, గ్రోమింగ్, బాతింగ్, పెళ్ళిళ్ళకి లేదా ఊర్లకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంచి వెళ్ళడానికి 20 రూమ్స్ కూడా నిర్మించారు. ఊరెళ్ళేప్పుడు ఎవరైనా ఇక్కడ వదిలి వెళ్లవచ్చు. ఇంకా అల్ టైప్ ఫుడ్, అసోరీస్ కూడా లభిస్తాయి.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు