హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఉద్యోగాల పేరుతో నిండా ముంచిన దళారులు: బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న స్పందించరా?

Peddapalli: ఉద్యోగాల పేరుతో నిండా ముంచిన దళారులు: బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న స్పందించరా?

ఆర్​ఎఫ్​సీఎల్​లో ఉద్యోగాలు

ఆర్​ఎఫ్​సీఎల్​లో ఉద్యోగాలు

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కేంద్రప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట భారీ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్న దళారులు దొరికినకాడికి దోచుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(E. Santosh, News 18, Peddapalli)

పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో (ఆర్‌ఎఫ్‌సి‌ఎల్‌‌‌లో) కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల (Contract Jobs)పేరిట భారీ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్న దళారులు దొరికినకాడికి దోచుకున్నారు. ఉద్యోగాల ఊసెత్తితే మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేశారు. దీంతో బాధితులు ఓపిక నశించి తిరుగుబాటు చేశారు. అయినా న్యాయం జరగలేదు. రోడుపైకి వచ్చిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. దేశమంతా ఆర్ఎఫ్‌సీఎల్ ఉద్యోగాల (RFCL Jobs) కుంభకోణం హాట్ టాపిక్‌గా మారినా బాధితులకు న్యాయం జరగలేదు.

కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలు అనడంతో నిరాశతో ఉన్న ఉద్యోగులంతా తమకు మేలు జరుగుతుందని భావించారు. అప్పు చేసి, ఇంట్లో ఉన్న బంగారం, భూములు తాకట్టుపెట్టి దళారులకు డబ్బులు ఇచ్చారు. ఇటు ఉద్యోగం లేక, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురవుతున్న బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగానికి డబ్బులు పెట్టి మోసపోయిన శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన ముంజ హరీష్... దళారులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన ఆత్మ బలిదానంతోనైనా మిగిలిన ఆర్‌ఎఫ్‌సి‌ఎల్ బాధితులకు న్యాయం జరగాలని ఆత్మ బలిదానానికి ఒడిగట్టి.. భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఉద్యోగాల పేరిట మోసానికి గురైన యువకులు ఇలా ఆత్మహత్యకు పాల్పడుతుంటే అధికారులు, స్థానిక నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఒక మరణంతో అధికార పార్టీకి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

ఆర్‌ఎఫ్‌సీ‌ఎల్ బాధితుల్లో మరో యువకుడు ఆత్మహత్యాయత్నం:

ఆర్‌ఎఫ్‌సీ‌ఎల్ (RFCL) కుంభకోణంలో మరో బాధిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉద్యోగం కోసం దళారులను నమ్మి అప్పులు తెచ్చి ఇచ్చిన డబ్బులు చెల్లించలేక మనస్థాపానికి గురై పురుగుల మందు (Poison) తాగి ఆత్మహత్యకు (Suicide) యత్నించాడు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన బొమ్మకాని తిరుపతి, అంతర్గామ్‌కు చెందిన తిరుపతి, గోదావరిఖనికి చెందిన సతీష్‌లు తన వద్ద ఉద్యోగం పేరుతో రూ. 7 లక్షలు తీసుకున్నారని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం బాధితుడు కరీంనగర్‌లో (Karimnagar) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. దళారులపై బసంతనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

First published:

Tags: Fake jobs, Local News, Peddapalli

ఉత్తమ కథలు