హోమ్ /వార్తలు /తెలంగాణ /

Great Teacher: టీచర్లలో ఈయన టీచింగ్​ డిఫరెంట్​.. అదే అవార్డులూ తెచ్చిపెట్టింది.. ఎవరాయనా? ఏంటా కథ?

Great Teacher: టీచర్లలో ఈయన టీచింగ్​ డిఫరెంట్​.. అదే అవార్డులూ తెచ్చిపెట్టింది.. ఎవరాయనా? ఏంటా కథ?

పెద్దపల్లి

పెద్దపల్లి టీచర్​

పుస్తకాల్లోని పాఠాలను బోధించడం ద్వారా ఒక విద్యార్థి వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతాడు మాస్టారు. కానీ పాఠాలతో పాటు నైతిక విలువలు బోధిస్తే ఆ విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడుతాడు. ఇదే సూత్రాన్ని నమ్మిన ఓ మాస్టారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  (E. Santosh, News18, Peddapalli)

  పుస్తకాల్లోని పాఠాలను బోధించడం (Teaching) ద్వారా ఒక విద్యార్థి వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతాడు మాస్టారు. కానీ పాఠాలతో పాటు నైతిక విలువలు (Values) బోధిస్తే ఆ విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడుతాడు. ఇదే సూత్రాన్ని నమ్మిన ఓ మాస్టారు తన వద్దకు వచ్చే విద్యార్థులకు జీవితంలో మంచి లక్ష్యాలు ఏర్పాటు చేసుకునేలా వారిలో నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు సామాజిక విలువలు నేర్పిస్తున్నాడు.

  ఒక విద్యార్థి (Student) ఉన్నతంగా ఎదిగితేనే ఉపాధ్యాయునికి వేతన ఆనందం ఉంటుందని నేషనల్ అవార్డు గ్రహీత లక్ష్మణ్ (Lakshman) అంటున్నారు. పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండంకు చెందిన కన్నూరి లక్ష్మణ్ రావు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత 28 సంవత్సరాలుగా రామగుండం పట్టణంలో 'క్రియేటివ్ ట్యుటోరియల్స్' పేరుతో ట్యుటోరియల్ పాఠశాల నడిపిస్తున్నారు.

  విద్యార్థుల్లో చదువుతో (Study) పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు ఉంటే వారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని బలంగా నమ్మిన లక్ష్మణ్ మాస్టారు ఆ దిశగా తన వద్దకు వచ్చిన విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పుతున్నారు. అంతేకాదు అనేక మంది పేద విద్యార్థులకు పాఠాలు భోదిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులలో సమాజ సేవ, సమయపాలన, వ్యక్తిత్వ వికాసం, ఇతర నైపుణ్యాన్ని వెలికితీస్తూ విద్యా బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నారు కన్నూరి లక్ష్మణ్.

  వ్యాసరచన పోటీలు, ఇతర వ్యాపకాలు..

  ప్రధానంగా విద్యార్థుల్లో కుటుంబ, సామాజిక విలువలు ఎంతగా ప్రభావితం చేస్తాయో వివరిస్తూ నైతిక విలువలు నేర్పుతున్నారు లక్ష్మణ్. పిల్లలపై తండ్రి చూపే శ్రద్ధ ఎలాంటిదో సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర తెలియజేస్తూ వారిని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేస్తున్నారు. అందులో భాగంగా తన వద్ద పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులకు కుటుంబ విలువలు, సామాజిక - నైతిక విలువలు తెలిసేలా వ్యాసరచన పోటీలు, ఇతర వ్యాపకాలు నిర్వహిస్తున్నారు. విద్య పట్ల, విద్యార్థుల పట్ల లక్ష్మణ్ మాస్టారు చూపిస్తున్న అంకిత భావానికి మెచ్చి "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లీడ్ ఇండియా ఆర్గనైజేషన్ " ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు వరించింది. లక్ష్మణ్ మాస్టారు వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులు అనేక మంది ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

  ఈ తరహా విద్యావిధానంతో దేశంలో నిరక్షరాస్యత ఉండనే ఉండదు.. ఇంతకీ ఎలా చెబుతున్నారంటే..!

  ప్రస్తుతం ఆయన ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూనే 'ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్' పెద్దపల్లి జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా ఉపాధ్యాయుడిగా సేవలను అందిస్తున్న సమయంలో మండలంలో, జిల్లాల్లో, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులూ అందుకున్నాడు లక్ష్మణ్ మాస్టారు. కరోనా విపత్కర సమయాల్లో ప్రైవేట్ టీచర్లకు అండగా నిలిచారు లక్ష్మణ్. తన వద్ద విద్య నేర్చుకొని.. ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యార్థుల సహకారంతో సుమారు 1800 మంది ఉపాధ్యాయులకు నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు లక్ష్మణ్ మాస్టారు. ఒక ఉపాధ్యాయుడు తాను నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పించాలి అనే వ్యాఖ్యలకు సరైన న్యాయం చేస్తున్న ఇటువంటి మాస్టారు అన్ని చోట్ల ఉండాలని కోరుకుందాం.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Peddapalli, Teaching

  ఉత్తమ కథలు