Home /News /telangana /

PEDDAPALLI TWO SCHOOL CHILDREN RESCUED AFTER COMPLAINT RECEIVED FROM PARENTS IN PEDDAPALLI DISTRICT ABH BRV PSE

Peddapalli: బాలికల అదృశ్యం, ఇద్దరు మైనర్లపై కేసు నమోదు!...

peddapallli crime news

peddapallli crime news

పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటనలో మరో ఇద్దరు మైనర్ బాలురపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రం సాంబయ్య(52) హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు చేసుకున్నాడు

ఇంకా చదవండి ...
    (E.Santosh , News 18, Peddapalli)

    పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటనలో మరో ఇద్దరు మైనర్ బాలురపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు ఎప్పటిలాగే మంగళవారం నాడూ స్కూల్‌కి వెళ్ళారు. సాయంత్రం అవుతున్నా వారు ఇంటికి చేరకపోవడంపై తలిదండ్రులు పాఠశాలలో సంప్రదించగా బాలికలు స్కూల్‌కి రాలేదని సిబ్బంది తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా సీసీటీవీ ఫుటేజిలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో బాలికల ఆచూకీ కనిపెట్టారు. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్ బాలురు,  బాలికలను కాగజ్‌నగర్‌కు తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. బాలికలను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని, ఇద్దరి మైనర్ బాలురపై కేసు నమోదు చేసి జూవైనల్ హోంకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

    గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రం సాంబయ్య(52) హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు వ్యక్తులు తనను వేధిస్తున్నట్లు లాడ్జి గదిలో సూసైడ్ నోట్ లభించడంతో జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోదావరిఖని మార్కండేయకాలనీ లో నివసిస్తున్న సాంబయ్య వారం క్రితం హైదరాబాద్ వెళ్లాడు. సెక్రటేరియెట్ సమీపంలోని ఓ లాడ్జీలో బస చేశాడు. లాడ్జీ గదిలో సోమవారం రాత్రి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాంబయ్య మరణ వార్తతో కుటుంబసభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడకు చెందిన ఓ వ్యక్తి వద్ద సాంబయ్య స్థలం కొనుగోలు చేశాడని, తర్వాత అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆ భూమి తమదే అంటూ తరచూ వేధించేవారని, దీనికి తోడు అప్పులు పెరిగిపోవడం, ఉన్న స్థలాన్ని ఇతరులకు విక్రయించకపోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని మృతి చెందాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు