హోమ్ /వార్తలు /తెలంగాణ /

Accident : ఆటోని ఢీకొట్టిన TS RTC ఎండీ కారు .. యాక్సిడెంట్‌లో సజ్జనార్‌తో పాటు ఐదుగురికి గాయాలు

Accident : ఆటోని ఢీకొట్టిన TS RTC ఎండీ కారు .. యాక్సిడెంట్‌లో సజ్జనార్‌తో పాటు ఐదుగురికి గాయాలు

Sajjanar car accident

Sajjanar car accident

Accident: రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, స్పీడ్‌ డ్రైవింగ్‌పై నిత్యం సోషల్ మీడియాలో ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండీ, ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ కారు ఆటోని ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, స్పీడ్‌ డ్రైవింగ్‌(Speed ​​driving)పై నిత్యం సోషల్ మీడియా(Social media)లో ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండీ, ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌(Sajjanar)కారు ఆటోని ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పండుగకు హైదరాబాద్(Hyderabad) నుంచి పెద్దపల్లి(Peddapalli) జిల్లా మీదుగా మహరాష్ట్ర (Maharashtra)వెళ్తుండగా శనివారం (Saturday)రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరి పరిస్థితి నార్మల్‌గానే ఉందని ఎవరికి ఎలాంటి ప్రాణపాయపరిస్థితి తలెత్తలేదని తెలుస్తోంది.

Telangana Govt Jobs: మంత్రి హరీశ్ రావు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన.. వివరాలివే

యాక్సిడెంట్‌లో నలుగురికి గాయాలు..

రోడ్డు ప్రమాదాలపై అవగాహన, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ సరికాదు..ర్యాష్ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు కొన్ని తెచ్చుకున్న కొన్ని వీడియోలు, సందర్భాలను తన ట్విట్టర్‌ పేజ్‌లో షేర్ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసే టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి కారణమైంది. సజ్జనార్‌ కారు హైదరాబాద్ నుంచి మహరాష్ట్రకు వెళ్తుండగా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్‌ రోడ్డు దగ్గర ఆటోని ఢీకొట్టింది. రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్‌ రహదారిపైకి అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈయాక్సిడెంట్‌లో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సజ్జనార్‌కు గాయాలు..

సజ్జనార్‌ కారు ఢీకొని గాయపడిన వాళ్లంతా రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అటుపై మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Peddapalli, Sajjanar, Telangana News

ఉత్తమ కథలు