(Santosh, News18,Peddapalli)
ప్రస్తుత రోజుల్లోభార్య భర్తలు ఇద్దరు జాబ్ చేసిన సరిపోవటం లేదు.నిరుపేదల కుటుంబాల్లో కేవలంభర్తల జీతంపై ఆధారపడితే ఎలాంటి ఇబ్బందులూ ఉంటాయనేది.... మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పని చేస్తే కానీ గడవని కుటుంబాలు ఇంక పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఆ సమస్యలనుఅర్థం చేసుకున్న సోమరపు లావణ్య(Somarapu Lavanya)వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒక అడుగు ముందుకేసారు .గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(Gautami Rural Development Trust)ద్వారా మహిళ స్వయం ఉపాధికి శిక్షణ తరగతులు ప్రారంభించి....వారికి కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారు. పెద్దపల్లి (Peddapalli)జిల్లా రామగుండం(Ramagundam)ప్రాంతమహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. గౌతమి ట్రస్ట్ అధ్వర్యంలో సోమరపు లావణ్య 2018 నుండి ఉచిత మగ్గం ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు.
రెండు వేల మందికి లబ్ధి..
ఇప్పటి వరకు 2000 వేల మంది మహిళలు ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ట్రైనింగ్ తీసుకొని స్వయం ఉపాధి చేసుకుంటున్నారు.ఇప్పుడు మరో బ్యాచ్ ట్రైనింగ్‌లో ఉన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో... మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా శిక్షణను ఇస్తున్నామని...గౌతమి ట్రస్ట్ సొమరపు లావణ్య అన్నారు.
ఆడవాళ్లకు మంచి అవకాశం..
చీరలు,జాకెట్లు రకరకాల డిజైన్లు వర్క్‌పై శిక్షణ అందిస్తే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారుకాకుండా మగ్గం వర్క్పైఆసక్తి ఉన్నవాళ్ళకి మరింతగా తోడ్పడతుందని లావణ్య అన్నారు. మగ్గం వర్క్ నేర్చుకోకపోవడం వల్ల బ్లౌజ్, చీరలకు వర్క్ చేయాలంటే.... సుమారు రూ. 2000 నుండి ప్రారంభం అవుతుంది.ఇది నేరుచుకోడం ద్వారా చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటుఅవుతుంది.
శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించే ట్రస్ట్..
ప్రస్తుతం మగ్గం వర్క్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈనేపథ్యంలోశిక్షణ పొందడం వల్ల మహిళల ఆర్థికంగా ఎదుగుతూ మరో నలుగురికి ఉపాధి కూడా కల్పించే అవకాశం దొరుకుతుంది. ఉచిత శిక్షణతో రూ. లక్ష వరకు లోన్ సదుపాయం.. గౌతమి రూరల్ డెవలప్మెంట్ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ తీసుకున్న మహిళలకు స్వయం ఉపాధికి సహకారం అందించేందుకు సర్టిఫికేట్‌తో పాటు రూ. 20వేలనుండి లక్ష రూపాయల వరకు లోన్ సదుపాయం కల్పిస్తున్నారు. వీరి ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వారు రామగుండం ప్రాంతాల్లో స్వయం ఉపాధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana News