హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ఫుల్ సెక్యూరిటీతో ఆడుతూ పాడుతూ కడపకు ప్రయాణం

Peddapalli: ఫుల్ సెక్యూరిటీతో ఆడుతూ పాడుతూ కడపకు ప్రయాణం

స్పెషల్ బస్సు ప్రారంభించిన అధికారులు

స్పెషల్ బస్సు ప్రారంభించిన అధికారులు

Telangana: ఆర్టీసి ప్రజలకు విలాసవంతమైన ప్రయాణం కోసం పెద్దపల్లి జిల్లా అధికారులు ఇప్పటికే పలు రకాల సౌకర్యాలు కల్పించారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పుల్ని కూడా తెస్తంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : పెద్దపల్లి

ఆర్టీసి ప్రజలకు విలాసవంతమైన ప్రయాణం కోసం పెద్దపల్లి జిల్లా అధికారులు ఇప్పటికే పలు రకాల సౌకర్యాలు కల్పించారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పుల్ని కూడా తెస్తంటారు. ఎందుకు అంటే సురక్షిత ప్రయాణమే వారి లక్ష్యం.. ఆరోగ్య ప్రయాణమే వారి బాధ్యత. ప్రజల ఆరోగ్యమైన ప్రయాణం కోసం ఇటీవలే బస్సులను త్వరగా సర్వీస్ చేసే ఆటోమేటిక్వాష్ పాయింట్ ను ఏర్పాటు చేసి బస్సులను ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తున్నారు. ఆర్టీసికి సంపదతో పాటే ప్రజల సౌకర్యాలు కూడా ముఖ్యమే అంటున్నారు అధికారులు. ప్రజలను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ప్రయాణం చేసేందుకుకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు ఆర్టీసి యాజమాన్యం.

గోదావరిఖని డిపో నుండి కడపకుకు కొత్త బస్సులు...

ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీఎస్​ఆర్టీసీ గోదావరిఖని డిపో నుండి రెండు కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. సుమారు ఒక కోటి పది లక్షలవ్యయంతో ఈ రెండు కొత్త బస్సులకు ఆర్టీసి కొనుగోలు చేసింది.

బస్ ప్రయాణికులకు ఫుల్ సెక్యూరిటీ...

కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్యానిక్‌ (panic) బటన్ సదుపాయం కల్పించారు. ఇబ్బందులు ఎదురైతే ఈ బటన్‌ను నొక్కగానే ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. అధికారులు స్పందించి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్​ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంది. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు. బస్సులో ఉష్ణోగ్రత పెరిగినా అలారం మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్​డీఏఎస్​ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు.

ఈ సందర్భంగా ఆర్టీసి మ్యానేజర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణం మరియు ఆరోగ్య కరమైన ప్రయాణాల కోసం ఆర్టీసి సంస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే కడపకి బస్సులు కొనుగోలు చేసిందన్నారు. త్వరలో మరిన్ని సూపర్ లగ్జరీ బస్సులను, ఏసీ బస్సులను కొనుగోలు చేస్తామని అన్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు