హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. సిగ్నల్ దాటారో నేరుగా మీ ఇంటికే చలనా

Peddapalli: ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. సిగ్నల్ దాటారో నేరుగా మీ ఇంటికే చలనా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Traffic Rules: వాహనదారులు ఇక నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనలను తప్పించుకోలేరు. స్మార్ట్‌ సిటీలో భాగంగా పెద్దపల్లి జిల్లా లో పలు ప్రదేశాల్లో అత్యాధునిక సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

(సంతోష్, న్యూస్ 18 తెలుగు, పెద్దపల్లి)

ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) ప్రజల ప్రాణ రక్షణ కోసమే అయినా ప్రజలు కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాహనాలు నడుపుతుంటారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ఎన్ని ప్రమాదాలు జరిగినా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు ఆపే చోట తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటివి చేసే అవకాశం లేదు. ఇక నుండి రూల్స్ పాటించకుంటే చలాన్లు డైరెక్ట్ ఇంటికే వస్తాయి. పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఇక నుంచి అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో వాహనదారులు అతివేగం, సిగ్నల్‌ జంపింగ్‌, హెల్మెట్‌, త్రిబుల్‌ రైడింగ్‌, రాంగ్‌రూట్‌ వంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భంలో చాలా మంది ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు.

వాహనదారులు ఇక నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనలను తప్పించుకోలేరు. స్మార్ట్‌ సిటీలో భాగంగా పెద్దపల్లి జిల్లా లో పలు ప్రదేశాల్లో అత్యాధునిక సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి, గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, బస్టాండ్‌,ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు,సిగ్నళ్ల వద్ద పోలీసులు ఎవరూ లేరని నిబంధనలు ఉల్లంఘిస్తామంటేఇక నుండి అస్సలు కుదరదు. ఇటువంటి వాహనదారుల జేబులకు చిల్లుపడక మానదు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ప్రతివాహనాన్ని అక్కడ ఏర్పాటు చేసి అత్యాధునిక సీసీ కెమెరాలు రికార్డు చేస్తాయి. సదరు వాహనం నిర్ధేశించిన వేగంకంటే ఎక్కువగా వెళ్లటం సిగ్నల్‌ జంప్‌ చేయటం సెల్‌ఫోన్‌ రైడింగ్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ త్రిబుల్‌ రైడింగ్‌, ఓవర్‌ స్పీడ్‌ హెల్మెట్‌ ధరించక పోవటం వంటి ఉల్లంఘనలను గుర్తించి వెంటనే ఆటోమేటిక్‌గా కంట్రోల్‌రూంకు ఫొటోతో సహా మెసేజ్‌ పంపిస్తుంది.

దీనిని ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం అంటారు. కంట్రోల్‌రూం నుంచి పోలీసు శాఖ ఆర్టీఏ అధికారుల కంప్యూటర్‌లకు సమాచారం చేరుతుంది. పోలీసులు ఒకసారి పరిశీలించి క్లిక్‌ చేయగానే సదరు వాహనదారుడి ఫోన్‌కు ఆ మెస్సేజ్‌ నిమిషాల వ్యవధిలో చేరుతుంది. ప్రస్తుతం నగరంలో నాలుగు చోట్ల ఈ అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. మిగితా కొన్నిప్రధాన కూడళ్లలో సిసి కెమేరాలు బిగించనున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, మార్కెట్‌, వాణిస్య సముదాయాల వద్ద, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో చోట్ల ఏర్పాటు చేయనున్న వరకు సర్వేలైన్స్‌ కెమెరాలను తీగల వంతెన సమీపంలోని పాత ఫిల్టర్‌ బెడ్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తున్నారు.

ప్రతి సిగ్నల్‌ వద్ద అన్ని దారులలో ఇరు వైపులా వాహనాలను గుర్తించే విధంగా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి మొత్తం సీసీ కెమెరాల నిఘా నీడలోకి రానుంది. ఎక్కడ ఏ ప్రమాదం, నేర ఘటన, మరేదైనా సంఘటన జరిగినా కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పరిశీలించి క్షేత్రస్థాయిలోని సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు అత్యాధునిక సిగ్నల్‌ వ్యవస్థతో ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులకు ఆటోమేటిక్‌గా జరిమానాలు విధిస్తూనే మరో వైపున ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి పెండింగ్‌ జరిమానా చలాన్‌లను క్లియర్‌ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Traffic challans

ఉత్తమ కథలు