PEDDAPALLI TO DEVELOP GREEN PARKS AND NURSERIES THIS YEAR HUGE BUDGET ALOCATED IN RAMAGUNDAM MUNICIPALITY SNR PSE BRV
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ప్రకృతి ప్రేమికుల కోసం కోట్ల నిధులు ఖర్చు .. దాని వెనుక ఓ సోషల్ కాజ్ ఉందిలే
( గ్రీన్ పార్కులకు నిధులు )
Peddapalli: తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గ్రీన్ అవార్డు రావడంతో నగరంలో పచ్చదనం మరింత పెంచేవిధంగా కృషి చేసే అవకాశాన్ని ఇచ్చాయని మేయర్ తెలిపారు
(santosh,News18,Peddapalli)
ఉద్యమంలా హరిత హారం కార్యక్రమoలో పాల్గొని రామగుండం(Ramagundam)నగరంలో పచ్చదనాన్ని పెంపొందించుకుందామని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్(Korukanti Chander)పిలుపునిచ్చారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్Bungee Anil Kumar అధ్యక్షతన బుధవారం (wednesday)నగర పాలక సంస్థ పాలకవర్గ ఐదవ అత్యవసర సమావేశం నిర్వహించారు. నగర పాలక సంస్థ ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం అంటే రామగుండం గుర్తుకు రావాలని అన్నారు. రాష్ట్ర భూభాగంలో 33 శాతం ఆటవీకరణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 'తెలంగాణ(Telangana)కు హరిత హారం' కార్యక్రమంతో పచ్చదనం పెంపొందించడంలో దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రమే ముందంజలో సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రామగుండం మున్సిపల్ పరిధిలోని గోదావరినదీ పరీవాహక ప్రాంతాన్ని జనగామ (Janagama)నుండి ఓసిపి వరకు పరిశుభ్రం చేసి మొక్కలు నాటి సంరక్షిస్తే, నగరంలో కాలుష్యం తగ్గిపోవడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దగలమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
రామగుండంలో నర్సరీలు, గ్రీన్ పార్కుల ఏర్పాటుకు బడ్జెట్:
రామగుండం పరిధిలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా తలపెట్టిన మహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములుగా మారి మొక్కలు నాటాలని నగర మేయర్ పిలుపునిచ్చారు. అయితే మొదటి విడతలో స్థానికంగా నర్సరీలు లేక ఇతర ప్రాంతాల నుండి మొక్కలు తెప్పించామని, ఇప్పుడు స్వయం సహాయక సంఘాల సహకారంతో రామగుండంలోనే నర్సరీలు అందుబాటులోకి రావడంతో మొక్కల పంపిణీకి కొరత లేదని వారు తెలిపారు. వాతావరణ సమతుల్యతను కాపాడే మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి తెలంగాణకు హరిత హారం కార్యక్రమానికి ఈ సమావేశపు అజెండాలో పెద్దపీట వేయడం పట్ల నగర పాలక సంస్థ పాలక వర్గ సభ్యులను, అధికారులను ఆయన అభినందించారు.
నాటిన మొక్కలు 85 శాతం కంటే తగ్గితే చర్యలు:
ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్ని మరింత సమర్దవంతంగా చేపట్టేందుకు నగర పాలకవర్గం ఈ ఏడాది భారీ బడ్జెట్ కేటాయించింది. మొక్కలు నాటడంతో పాటు 85 శాతం మొక్కలు బ్రతికి వుండేలా వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించేదుకు చర్యలు తీసుకున్నారు. ఈ విధులను నిర్లక్ష్యం చేసే వారిపై.. కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోనున్నారు.
రామగుండంకు గ్రీన్ అవార్డ్ మరింత ప్రోత్సాహం:
తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గ్రీన్ అవార్డు రావడంతో నగరంలో పచ్చదనం మరింత పెంచేవిధంగా కృషి చేసే అవకాశాన్ని ఇచ్చాయని మేయర్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తానే ఈ అవార్డ్ స్వీకరించానని ఆయన తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ బి.సుమన్ రావు మాట్లాడుతూ కార్పొరేటర్ల సూచన మేరకు ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్ని డివిజన్ స్థాయిలో, పట్టణ స్థాయిలో పర్యవేక్షించేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. గోదావరి నది ఒడ్డున జనగామలో, ఐటిఐ కళాశాల, ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ ప్రాంగణాలలో బ్లాక్ ప్లాంటేషన్ కొరకు స్థలాలు గుర్తించామనీ అలాగే బి- పవర్ హౌస్ నుండి గోదావరి బ్రిడ్జి వరకు సర్వీస్ రోడ్ల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేపడతామని కమిషనర్ అన్నారు.
పచ్చదనం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయింపు:
నగర పాలక సంస్థ గ్రీన్ బడ్జెట్ నిధులు, ఎన్టీపీసీ సిఎస్ నిధులు కలిపి మొత్తం రూ.9 కోట్లు వెచ్చించి ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని మేయర్ బంగి అనిల్ కుమార్ తెలిపారు. ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా రామగుండం పరిధిలో నర్సరీలను అభివృద్ది చేయడానికి రూ. 68.00 లక్షలు, పార్కులు, కూడళ్ళు , అమృత్ పార్కులు, పాత డంపింగ్ యార్డులలో మొక్కల నిర్వహణ కొరకు రూ. 36.00 లక్షలు, నూతన ట్రీ పార్కుల ఏర్పాటు కొరకు రూ. 157.00 లక్షలు, అవెన్యూ ప్లాంటేషన్ కొరకు రూ. 285 లక్షలు ఇతర పనుల కొరకు రూ. 17.00 లక్షలు, ఎన్టిపిసి- సిఎస్ఆర్ నిధులు రూ 9.00 కోట్లతో ప్లాంటేషన్ కలిపి మొత్తం రూ. 14 కోట్ల 63 లక్షలు బడ్జెట్ కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.