హోమ్ /వార్తలు /తెలంగాణ /

Train accident : రైలు పట్టాలపై పని చేస్తుండగానే దూసుకెళ్లిన రాజధాని ఎక్స్‌ప్రెస్..ఎంత మంది చనిపోయారో తెలుసా..

Train accident : రైలు పట్టాలపై పని చేస్తుండగానే దూసుకెళ్లిన రాజధాని ఎక్స్‌ప్రెస్..ఎంత మంది చనిపోయారో తెలుసా..

TRAIN ACCIDENT

TRAIN ACCIDENT

ACCIDENT:పెద్దపల్లి జిల్లా స్టేషన్ కొత్తపల్లి శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది . ఈరోజు ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని రైల్వే సిబ్బంది ఒకరు , దినసరి కూలీలు ఇద్దరూ .. మొత్తం ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  (P.Srinivas,New18,Karimnagar)

  పెద్దపల్లి(Pedpadally)జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లి మండలం చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు(Train accident) ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. న్యూఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌(Rajdhani Express)ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన వాళ్లలో ఒకరు పర్మినెంట్ రైల్వే ఉద్యోగిగా తేలింది. మరో ఇద్దరు మృతులు కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

  గమనించకపోవడం వల్లే ..

  పెద్దపల్లి జిల్లా స్టేషన్ కొత్తపల్లి శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది . ఈరోజు ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని రైల్వే సిబ్బంది ఒకరు , దినసరి కూలీలు ఇద్దరూ .. మొత్తం ముగ్గురు మృతి చెందారు. రైల్వే ట్రాక్‌లకు గ్రీసింగ్ చేస్తున్న సమయంలో పక్కనే ట్రాక్ నుండి గూడ్స్ రైలు వెళుతుండగా ఆ శబ్దం కారణంగా ట్రాక్‌పై పని చేస్తున్నారు. అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ రావడాన్ని గమనించకపోవడంతో రైలు ముగ్గురుని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు శరీరాలు ముక్క ముక్కలుగా ఎగిరిపడ్డాయి. మృతుల్లో రైల్వే ఉద్యోగి దుర్గయ్యగా గుర్తించారు. మరో ఇద్దరు డైలీ కూలీలని తేల్చారు. పెద్దకల్వల , సుల్తానాబాద్ లకు చెందిన శ్రీనివాస్ , వేణులుగా భావిస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Peddapalli, Telangana News, Train accident

  ఉత్తమ కథలు