హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: కలలు కన్నాడు వాటిని సాకారం చేసుకుంటున్నాడు.. నేటి తరానికి ఆదర్శంగా పెద్దపల్లి యువకుడు

Peddapalli: కలలు కన్నాడు వాటిని సాకారం చేసుకుంటున్నాడు.. నేటి తరానికి ఆదర్శంగా పెద్దపల్లి యువకుడు

నటుడిగా రాణిస్తున్న పెద్దపల్లి యువకుడు

నటుడిగా రాణిస్తున్న పెద్దపల్లి యువకుడు

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం స్పూర్తితో ఓ యువకుడు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూ, కన్న కలను నిజం చేయడంలో ఎలాంటి ఆనందం ఉంటుందో చెబుతున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  E. Santosh, News 18, Peddapalli

  జీవితంలో ఎదగాలన్న ఆకాంక్ష అందరికి ఉంటుంది. అయితే అనుకోని అవాంతరాలు ఎదురైతే ఆ ఆకాంక్షలు నిర్వీర్యం అవుతాయి. కానీ అటువంటి అవాంతరాలు ఎన్ని ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం స్పూర్తితో ఓ యువకుడు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూ, కన్న కలను నిజం చేయడంలో ఎలాంటి ఆనందం ఉంటుందో చెబుతున్నాడు. తెలంగాణ (Telangana) లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖని చెందిన రాజేష్.. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఓ పూట తింటే మరో పూట కూడా గడిచే స్థితిలేదు. అలాంటి పరిస్థితుల నడుమ ఆ యువకుడు కలలుగన్న శిఖరాలను చేరాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎన్నో కష్టాల నడుమ ఆ క్షణం ఆకలి తీర్చుకోవాలి అన్న ఆలోచనలే చాలా మందిలో వస్తుంటాయి.

  కానీ అన్నిటికీ రాజేష్ మాత్రం పట్టుదలతో డిగ్రీ వరకు చదివి అనంతరం తన అభిరుచి మేరకు షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించాడు. సినిమాలంటే ఎంతో మోజు పెంచుకున్న రాజేష్ సినిమాల్లో ప్రతి ఒక పాత్రను అధ్యయనం చేసేవాడు. అలా సినిమా రంగం వైపు అతని ఆలోచనలు మళ్ళాయి. మొదట స్థానికంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించాడు. అలా తీస్తున్న క్రమంలో సామాజిక విలువలతో కూడిన ఓ సినిమాను తీశాడు రాజేష్. అది గుర్తించిన సింగరేణి సంస్థ అతని ప్రతిభకు మెచ్చి రెండు గుంతల భూమిని బహుమతిగా అందించింది.

  ఇది చదవండి: రాజన్న భక్తులకు శుభవార్త.. ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజలు

  సినీ రంగంలోకి ప్రయాణం: లింగంపల్లి రాజేష్.. సినిమా కోసమని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నాడు. ఎన్నో ఆటుపొట్లు అనంతరం మా టీవిలో ప్రదర్శించ బడే కార్తీక దీపం సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసాడు. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ రాజేష్ ఇప్పటి వరకు సుమారు 40 షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లకు పని చేశాడు.

  ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించాడు రాజేష్. త్వరలో ఓదెలు రైవే స్టేషన్ 2లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్ర పోషించనున్నట్లు రాజేష్ తెలిపాడు. సంపత్ నంది దర్శకత్వంలోనే సాయి ధర్మతేజతో చేసే సినిమాలో కూడా నటించే అవకాశం లభించినట్టు రాజేష్ తెలిపాడు. పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడ్డ రాజేష్ జీవితం చివరికి ఆయన కన్నకలలు నిజం అనిపించేలా చేరింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Peddapalli, Telangana

  ఉత్తమ కథలు