హోమ్ /వార్తలు /తెలంగాణ /

20 ఏళ్లుగా గుడిలేని ఊరు.. ఒకేసారి మూడు ఆలయాల నిర్మాణం.. దైవాజ్ఞ అంటే ఇదేనేమో..!

20 ఏళ్లుగా గుడిలేని ఊరు.. ఒకేసారి మూడు ఆలయాల నిర్మాణం.. దైవాజ్ఞ అంటే ఇదేనేమో..!

X
temples

temples

ఆత్మకు దేహం ఆలయమైనట్లే.. ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం కూడా అటువంటిది. పూజామందిరంలేని ఇల్లు, దేవాలయంలేని ఊరు జీవంలేని దేహంకు సమానమే. కాబట్టి పూజచేయని ఇంటిలో అడుగుపెట్టరాదు.. దేవాలయంలేని ఊరి దారిలో పయనించరాదని, ఆ ఇండ్లలో, ఆ ఊళ్ళల్లో భోజనం చేయరాదని, చివరకు పచ్చి గంగ కూడా తాగరాదని శాస్తం చెబుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

E.Santosh, News18, Peddapalli

ఆత్మకు దేహం ఆలయమైనట్లే.. ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం కూడా అటువంటిది. పూజామందిరంలేని ఇల్లు, దేవాలయంలేని ఊరు జీవంలేని దేహంకు సమానమే. కాబట్టి పూజచేయని ఇంటిలో అడుగుపెట్టరాదు.. దేవాలయంలేని ఊరి దారిలో పయనించరాదని, ఆ ఇండ్లలో, ఆ ఊళ్ళల్లో భోజనం చేయరాదని, చివరకు పచ్చి గంగ కూడా తాగరాదని శాస్తం చెబుతోంది. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) పాలకుర్తి మండలంలోని పొట్యాల గ్రామంలో గత 20 ఏళ్లుగా గుడి లేదు. ఆ ఊరు ప్రజలు గుడికి వెళ్ళాలంటే తీర్థ యాత్రలకు వెళ్ళడమే తప్ప వేరే మార్గం లేదు. పలు సార్లు ఆ ఊరి పెద్దమనుషులు ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ మధ్యలోనే విరమించుకున్నారు.

ఓ సారి ఓవేద పండితుడుఆ ఊరిని చూసి.. ఈ ఊర్లో గుడి లేకపోతేఊరికే అరిష్టం.. గుడి నిర్మాణం చేయకపోతే ప్రతి ఇంటికి కీడు జరుగుతుందనిచెప్పడంతో ప్రజలు అందరూ మమేకం అయ్యారు. ఒక మాట మీదకదిలారు. గుడి నిర్మాణానికి సoకల్పించారు. ఊర్లో ఎవరు ఎంత ఇవ్వాలనే డిమాండ్ ఏదీ లేకుండా ఎవరికీ తోచినంత వారు ప్రతి ఇంటి నుండి జమ చేశారు. ఆ ఊర్లో కొంత మందిపెద్ద మనుషులు ఊరి మీద ప్రేమతోపెద్ద ఎత్తున విరాళం ఇచ్చారు. మొత్తంగా ఆ ఊర్లో 6 గంటలలో ఆలయ నిర్మాణానికి విరాళాలు జమ చేశారు.

ఇది చదవండి: హస్త కళలకు కేరాఫ్ అడ్రస్.. లేపాక్షి ప్రత్యేకత ఇదే

ఈ నిర్మాణానికి ఊర్లో ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు సహకారాలు దక్కాయి. పొట్యాల గ్రామంలో ఒకేసారి మూడు ఆలయల నిర్మాణం చేపట్టి 33 విగ్రహాల ప్రతిష్ట చేశారు. శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సరస్వతి ఆలయం ఒకేసారి నిర్మించారు. ఈ ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుండి గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రిచే ప్రత్యేకత పూజలు నిర్వహన చేశారు.

ప్రత్యేకంగా వేద పండితులతో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి రోజూ పొద్దున నుండి రాత్రి వేళ వరకు నిత్యం 5 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ఇలా ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించడం వల్ల ఊర్లో దేవత మూర్తుల అనుగ్రహం కలిగి ఊర్లో ప్రజలు సుఖ శాంతులతో జీవనం సాగిస్తారని నమ్మకం. ఈ ఊరికి ఇక కీడు అనేది జరగకుండా ఉండేలా గ్రామాన్ని క్షేమంగా కాపాడుతారని ప్రజల అపార నమ్మకం. గ్రామంలో ఆలయాల నిర్మాణం పూర్తి అనంతరం ఈ గ్రామ ఆలయ నిర్మాణానికి దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

First published:

Tags: Local News, PEDDAPALLI DISTRICT, Telangana

ఉత్తమ కథలు